Indian Air Force: ఈశాన్యంలో వైమానిక విన్యాసాలు
Sakshi Education
ఈశాన్య ప్రాంతంలో భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విన్యాసాలు డిసెంబర్ 15న ప్రారంభమయ్యాయి.
ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ జెట్లతో సహా ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ పరిధిలోఉన్న సుఖోయ్–30 యుద్ధవిమానం, ఇతర అత్యాధునిక యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో వాస్తవాదీన రేఖ వద్ద చైనా సైనికుల చొరబాటు యత్నం నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఇవి జరుగుతున్నాయని, సైనికుల ఘర్షణతో వీటికి సంబంధం లేదని భారత వైమానిక దళం స్పష్టం చేసింది. ఈ విన్యాసాలు రెండు రోజుల పాటు జరిగాయి. 36 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరుకున్నాయని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది.
Yuddha Abhyas 2022: చైనా సరిహద్దుల్లో..భారత్, అమెరికా 'యుద్ధ అభ్యాస్'
Published date : 16 Dec 2022 12:06PM