Scientific Publications: శాస్త్రీయ ప్రచురణల్లో మూడో స్థానంలో భారత్
Sakshi Education
శాస్త్రీయ ప్రచురణల్లో మన దేశం ప్రపంచంలోనే మూడో స్థానానికి ఎగబాకిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
డిసెంబర్ 18న జరిగిన మంత్రిత్వ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010లో ప్రపంచంలో ఏడో స్థానం ఉన్న భారత్.. 2020 నాటికి మూడో స్థానానికి చేరుకున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ తెలిపిందన్నారు. 2010లో భారత్‌లో 60,555 సిద్ధాంత పత్రాలు ప్రచురితం కాగా 2020లో వీటి సంఖ్య సుమారు 1.50 లక్షలకు పెరిగిందన్నారు. సైన్స్, ఇంజినీరింగ్ పీహెచ్‌డీల సంఖ్యలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని మంత్రి చెప్పారు. ఇండియా పేటెంట్ ఆఫీస్(ఐపీవో) 2018–19 సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్తలకు 2,500 పేటెంట్లు మంజూరు చేయగా 2020–21 నాటికి ఇవి 5,629కు పెరిగినట్లు వెల్లడించారు.
Weekly Current Affairs (Awards) క్విజ్ (18-24 నవంబర్ 2022)
Published date : 19 Dec 2022 01:36PM