Skip to main content

Independence Day: వరుసగా 11వ సారి.. ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన ఘనత

భారతదేశం ఆగస్టు 15వ తేదీ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది.
Independence Day 2024 PM Narendra Modi’s Special Guest List

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో మోదీ మరో అరుదైన ఘనత సాధించన వారవ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు భారతదేశ తొలి ప్రధానమంత్రి.. వరుసగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన‌ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఈ ఘనతను సాధించారు. నెహ్రూ దేశ మొదటి ప్రధానమంత్రిగా వరుసగా 11 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు.

2024 సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దాదాపు నాలుగువేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో రైతులు, యువత, మహిళలు, అల్పాదాయ వర్గాలవారు ఉన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు ఎర్రకోటలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు.  

వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. వీరిలో వెయ్యిమంది మంది అతిథులు వ్యవసాయం, రైతు సంక్షేమ రంగానికి చెందినవారు. యువజన విభాగం నుంచి 600 మంది, మహిళా శిశు అభివృద్ధి నుంచి 300 మంది అతిథులు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 300 మంది, గిరిజన శాఖ నుంచి 350 మంది అతిథులు హాజరుకానున్నారు. 

History of 15th August: చరిత్రలో ఆగస్టు 15న చోటుచేసుకున్న ఘటనలు ఇవే..

అతిథుల పూర్తి జాబితా ఇదే..

            విభాగం                                                                 అతిథుల సంఖ్య

వ్యవసాయం , రైతు సంక్షేమం                                       1,000 మంది అతిథులు

యువజన వ్యవహారాలు                                                  600 మంది 

క్రీడా విభాగానికి సంబంధించినవారు                              150 మంది 

మహిళా, శిశు అభివృద్ధి శాఖ                                            300 మంది 

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ                           300 మంది 

గిరిజన వ్యవహారాలశాఖ                                                  350 మంది 

పాఠశాల విద్య, అక్షరాస్యత రంగాలకు చెందినవారు      200 మంది 

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్/మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్               200 మంది 

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి..                     150 మంది 

నీతి ఆయోగ్‌కు చెందినవారు                                         1,200 మంది 

 

Published date : 14 Aug 2024 04:10PM

Photo Stories