Solar village: సంపూర్ణ సౌర గ్రామం మొధెరా
ఈ సందర్భంగా మొధెరాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘సూర్య దేవాలయం ఉన్న గ్రామంగానే మొధెరాకు పేరుంది. ఇప్పుడు సౌర గ్రామంగా కూడా పేరు తెచ్చుకుంటుంది’అని మోదీ అన్నారు. నివాస, ప్రభుత్వ భవనాలపై ఏర్పాటు చేసిన 1,300 రూఫ్‌టాప్ సిస్టమ్స్ ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ 24 గంటలూ నిరంతరాయంగా అందుతుంది. మిగులు విద్యుత్‌ను నిలువ చేసేందుకు బ్యాటరీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. స్థానికులు ఉచితంగా కరెంటును వాడుకోడంతోపాటు అదనపు కరెంటును విక్రయించుకుని డబ్బు సంపాదించుకోవచ్చునన్నారు. 21వ శతాబ్దంలో స్వయం సమృద్ధ భారత్ సాధనకు ఇటువంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందని ప్రధాని పేర్కొన్నారు.
అనంతరం ఆయన రూ.3,900 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపనలు చేశారు.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో GST వసూలు చేసింది?