OTT Platforms: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓటీటీల్లో కూడా పొగాకు వ్యతిరేక హెచ్చరికలు
ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌ల్లో కూడా పొగాకు వ్యతిరేక హెచ్చరికలు, ప్రకటనల ప్రసారాన్ని తప్పనిసరి చేసింది. సినిమా థియేటర్లు, టీవీ కార్యక్రమాల్లో మాదిరిగానే ఓటీటీల్లో కూడా పొగాకు వ్యతిరేక డిస్‌క్లెయిమర్లు వేసేలా సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2004కు కేంద్రం సవరణలు చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మే 30న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు వ్యతిరేక ప్రకటనలను తప్పనిసరి చేసిన తొలి దేశం భారతే. ఇకపై ఓటీటీల్లో ప్రసారమయ్యే ఏ కార్యక్రమానికైనా ముందు 30 సెకండ్లు, లేదంటే మధ్యలో 30 సెకండ్లు పొగాకు వాడకం క్యాన్సర్ కారకం, ఆరోగ్యానికి హానికరమన్న ప్రకటన ప్రసారం చేయాలి.
Vande Bharat Express: ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
కార్యక్రమాల్లో పొగ తాగే, మద్యం సేవించే సన్నివేశాలుంటే అది హానికరమన్న డిస్‌క్లయిమర్ స్క్రీన్‌పై 20 సెకండ్లు తప్పనిసరిగా రావాలి. ఈ హెచ్చరికలు, ప్రకటనలు ఓటీటీ కంటెంట్ ప్రసారమయ్యే భాషలోనే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఓటీటీల్లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్‌లు, ఇతర కార్యక్రమాల్లో పొగాకు ఉత్పత్తుల్ని విచ్చలవిడిగా చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.