Natural Disasters: తౌక్టే తుపానుతో దెబ్బతిన్న రాష్ట్రం?
2020 ఏడాది తుపాన్లు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన ఆరు రాష్ట్రాలకు అదనంగా రూ.3,063 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ డిసెంబర్ 30న సమావేశమై... జాతీయ విపత్తు నిర్వహణ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది.
యాస్ తుపాన్ తాకిడికి గురైన రాష్ట్రం?
తౌక్టే తుపానుతో దెబ్బతిన్న గుజరాత్‌కు అత్యధికంగా రూ.1,133 కోట్లు, యాస్ తుపాన్ తాకిడికి గురైన పశ్చిమ బెంగాల్‌కు రూ.586 కోట్లు ఇవ్వనున్నారు. కర్ణాటకకు రూ. 504 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ. 600 కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ. 187 కోట్లు, అస్సాంకు రూ.51 కోట్లు కేటాయించారు. రాష్ట్రాల విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) కింద ఆయా రాష్ట్రాలకు జమ చేసిన దానికి ఇది అదనమని హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద 28 రాష్ట్రాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ, 17,747 కోట్లు విడుదల చేశామని పేర్కొంది.
ఐటీ హబ్ కు శంకుస్థాపన..
అన్నిరంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలిచే నాలుగో రాష్ట్రం మనదేనని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. డిసెంబర్ 31న నల్లగొండలో ఐటీ హబ్, సమీకృత వెజ్–నాన్‌వెజ్ మార్కెట్‌లకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డిలతో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ను ప్రారంభించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని.. రూ.100 కోట్లు ప్రకటించగా ఇప్పటికే రూ.30 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
చదవండి: దేశంలో తొలి వాటర్ మెట్రోను ఎక్కడ ప్రారంభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆరు రాష్ట్రాలకు అదనంగా రూ.3,063 కోట్ల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : 2020 ఏడాది తుపాన్లు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్