Skip to main content

Governors Meeting: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లే సంధానకర్తలు..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండు రోజుల గవర్నర్ల సదస్సును ఆగస్టు 2వ తేదీ ప్రారంభించారు.
Governor should be a bridge between Centre and State tells President Droupadi Murmu

ఆగస్టు 3వ తేదీ ముగిసిన ఈ సదస్సులో ఆమె ప్రసంగించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని ముర్ము సూచించారు.

➤ ఆమె కేంద్ర, రాష్ట్ర సంబంధాల రూపకల్పన, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వివిధ అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు రాష్ట్రపతి భవన్‌ పేర్కొంది. 

➤ ఇందులో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం అనే మూడు కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా న్యాయ వ్యవస్థలో కొత్త శకానికి నాంది పలుకుతుంద‌ని రాష్ట్ర‌ప‌తి స్ప‌ష్టం చేశారు. 

➤ మెరుగైన పనితీరుకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారాన్ని పొందేందుకు, నిరంతర సంప్రదింపులకు సాగించడంలో గవర్నర్లు సంశయించరాదని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ సూచించారు. 

➤ రాజ్‌భవన్‌లలో ఆదర్శ పాలనా నమూనాను రూపొందించడానికి గవర్నర్లు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. గవర్నర్లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, డిజిటైజేషన్‌ను ప్రోత్సహించాలని కోరారు.

Shinkun La Tunnel : ‘షింకున్‌ లా టన్నెల్‌’ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ!

Published date : 06 Aug 2024 09:54AM

Photo Stories