BBCపై రూ.10 వేల కోట్ల పరువు నష్టం కేసు!
Sakshi Education
'ది మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)పై ఓ ప్రభుత్వేతర సంస్థ ఢిల్లీ హైకోర్టులో రూ.10 వేల కోట్ల పరువు నష్టం దావా వేసింది.
ఈ డాక్యుమెంటరీలో ప్రధాని మోదీ, భారత న్యాయవ్యవస్థపై తప్పుడు ఆరోపణలతో బీబీసీ భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపించింది.
గుజరాత్‌కు చెందిన జస్టిస్ ఆన్ ట్రయల్ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. బీబీసీ (యూకే)తోపాటు బీబీసీ(ఇండియా)కు సమన్లు ఇచ్చింది. సెప్టెంబర్ 25న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. పిటిషన్‌దారు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. నష్ట పరిహారంతోపాటు తమ సంస్థకు ఇతర ఆదాయ మార్గాలు లేనందున కోర్టు ఫీజులు తదితరాల కోసం రూ.10 వేల కోట్లు చెల్లించాలని కోరారు.
Current Affairs Quiz
April Weekly Current Affairs (International) Bitbank: gold backed digital currencyని ఏ దేశం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది?
April Weekly Current Affairs (Persons) Bitbank: HDFC బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
April Weekly Current Affairs (Awards) Bitbank: ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్-2023లో భారత్ ర్యాంక్ ఎంత?
April Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరా చేసే దేశం ఏది?
April Weekly Current Affairs (Sports) Bitbank: JioCinema బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
April Weekly Current Affairs (Science & Technology) Bitbank: ఏ సంస్థ ఇటీవల రెండు సింగపూర్ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది?
Published date : 23 May 2023 11:21AM