Indira Gandhi Bhawan: ఢిల్లీలో ఏఐసీసీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభం
ఈ కార్యాలయానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఎగరవేశారు.
ప్రస్తుతం, అక్బర్ రోడ్ 24వ నంబర్ బంగ్లా నుంచి ఏఐసీసీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం గతంలో పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ బంగ్లాల్లో ఉండకూడదని నిర్ణయించిన తరువాత, అన్ని పార్టీలూ తమ సొంత కార్యాలయ భవనాలు నిర్మించుకున్నారు. ఇంతకాలం అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ కార్యకలాపాలు కొనసాగాయి. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా పని చేస్తోంది.
ఇందిరాగాంధీ భవన్ 9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించబడింది. కోల్తా మార్గ్ కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా, అక్బర్ రోడ్ నుంచి కూడా కార్యకలాపాలు కొనసాగుతాయని పార్టీ నేతలు తెలిపారు.
Mahakumbh 2025: మహా కుంభమేళాకు 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం!
2008లో దీనదయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించింది. అనంతరం, 2009లో కొత్త కార్యాలయ నిర్మాణం మొదలైంది. ఇది 15 సంవత్సరాలు పాటు సాగింది.