Cinema Hall: సినిమా హాళ్లలో తినుబండారాలపై నిషేధం..
Sakshi Education
సినిమా హాళ్లలోకి బయటి నుంచి తినుబండారాలను అనుమతించే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
సినిమా హాల్ అనేది ప్రైవేట్ ఆస్తి అని, అందులోకి బయటి తినుబండారాలను అనుమతించాలా? లేదా? అనేది నిర్ణయంచుకొనే హక్కు యాజమాన్యానికి ఉందని తేల్చిచెప్పింది. ప్రేక్షకులు బయటి నుంచి తినుబండారాలు, పానీయాలు తీసుకురాకుండా అడ్డుకోరాదని, అందుకు అనుమతించాలని ఆదేశిస్తూ జమ్మూకశ్మీర్ హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ థియేటర్ ఓనర్లు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జమ్మూకశ్మీర్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్లలకు అవసరమైన ఆహారాన్ని తల్లిదండ్రులు సినిమా హాల్లోకి తీసుకొస్తే అడ్డుకోవద్దని స్పష్టం చేసింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డులు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)
Published date : 04 Jan 2023 12:24PM