Ordinance: సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఎన్నేళ్లకు కేంద్రం పెంచింది?
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ల డైరెక్టర్లు ఇకపై ఐదేళ్ల వరకు కొనసాగేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 14న రెండు ఆర్డినెన్స్‌లను జారీ చేసింది. అలాగే రక్షణ, హోంశాఖ కార్యదర్శులు, ఐబీ డైరెక్టర్, ‘రా’ కార్యదర్శి పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించేలా ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు వీరి పదవీ కాలం రెండేళ్లుగా ఉంది.
ఈడీ చీఫ్ పదవీకాలం ఏడాది పొడిగింపు
ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్రం మరో ఏడాదిపాటు పెంచింది. ఈ మేరకు నవంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నవంబర్ 17న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా... 2022 నవంబరు 18 దాకా పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు విదేశాంగ కార్యదర్శి పదవీకాలాన్ని కూడా రెండు నుంచి ఐదేళ్లకు పెంచుతూ నవంబర్ 17న కేంద్రం ఉత్తర్వులిచ్చింది.
2018 నవంబరు 18న బాధ్యతలు..
1984 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన మిశ్రా 2018 నవంబరు 18న రెండేళ్ల పదవీకాలానికి ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రెండేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో మరో ఏడాది పొడిగిస్తూ 2020లో కేంద్రం ఆదేశాలిచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఎస్‌కే మిశ్రా పదవీ కాలాన్ని 2021, నవంబర్ 17వ తేదీ తర్వాత పొడిగించవద్దని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చి... మిశ్రాకు మరో ఏడాది పొడిగింపునిచ్చింది.
చదవండి: భారత ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు ఏ నగరంలో ప్రారంభమైంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్