CDS: జనరల్ బిపిన్ రావత్ దంపతులకు తుది వీడ్కోలు
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. రావత్ దంపతుల పార్థివ దేహాలకు ఢిల్లీలోని కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో డిసెంబర్ 10న దహన సంస్కారాలు నిర్వహించారు. రావత్‌కు సైనికులు 17 శతఘ్నులతో గన్ సెల్యూట్ సమర్పించారు. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ రావత్ దంపతులతోపాటు మృతిచెందిన బ్రిగేడియర్ లిడ్డర్ అంత్యక్రియలను కూడా బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు.
17 గన్ సెల్యూట్ ఎవరికి?
రాష్ట్రపతి, అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల అంతిమ వీడ్కోలు సందర్భంగా 21 గన్ సెల్యూట్ సమర్పిస్తుంటారు. నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మరణిస్తే 17 గన్ సెల్యూట్ సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. భారత తొలి డీసీఎస్ జనరల్ రావత్ ర్యాంక్.. ఆర్మీ చీఫ్, వాయుసేనాధిపతి, నావికా దళాధిపతిల ర్యాంక్‌లతో సమానం. అందుకే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో సమానంగా అంత్యక్రియల్లో 17 గన్ సెల్యూట్ సమర్పించారు. ‘2233 ఫీల్డ్ రెజిమెంట్’కు చెందిన 17 శతఘ్నులతో రావత్‌కు గన్ సెల్యూట్ చేయించారు. ఇతర దేశాల అధినేతలు, అతిథులు భారత్‌కు వచ్చినప్పుడు 19 గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించడం ఆనవాయితీ.
చదవండి: ఎంఐ–17వీ5 ప్రమాదంపై ఎవరి నేతృత్వంలో దర్యాప్తు జరగనుంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్