Skip to main content

Green Hydrogen Mission: గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌కు రూ.19,744 కోట్లు

దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఈ ఏడాది రూ.19,744 కోట్లు కేటాయించింది.

దీంతో నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ ద్వారా 2030 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ చెప్పారు. వచ్చే అయిదేళ్లలో ఏడాదికి 50 లక్షల టన్నుల చొప్పున గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు.

PM Modi: రూ.22వేల కోట్ల భారీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన

ప్రభుత్వం ఇప్పుడు కేటాయించిన రూ.20 వేల కోట్ల విలువైన ప్రోత్సాహకాలతో దాని ధర తగ్గుతుందని అన్నారు. కార్బన్‌ రహిత హైడ్రోజన్‌ను ఆటోమొబైల్స్‌, ఆయిల్‌ రిఫైనరీలు, స్టీల్‌ ప్లాంట్లలో ఇంధనంగా వినియోగించవచ్చునని ఠాకూర్‌ చెప్పారు. ఈ మిషన్‌ కోసం ప్రాథమికంగా రూ.19,744 కోట్లు కేటాయించామని, స్ట్రాటజిక్‌ ఇంటర్‌వెన్షన్స్‌ ఫర్‌ గ్రీన్‌ హైబ్రోజన్‌ ట్రాన్సిషన్‌ (సైట్‌) కార్యక్రమానికి రూ.17,490 కోట్లు, ఫైలెట్‌ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కి రూ.400 కో ట్లు, ఇతర అవసరాల కోసం రూ.388 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్‌ అంగీకారం తెలిపిందని మంత్రి వివరించారు. ఈ మిషన్‌ సాకారమైతే ఇంధన రంగంలో భారత్‌ స్వయంప్రతిపత్తిని సాధిస్తుంది. 

Demonetisation: పెద్ద నోట్ల రద్దు సరైనదే.. సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే..

Published date : 05 Jan 2023 01:13PM

Photo Stories