Sarbananda Sonowal: 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది?
రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలం, కాన్హా గ్రామంలోని కాన్హా శాంతి వనంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్, ఫిట్ ఇండియా, పతంజలి ఫౌండేషన్, కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో జనవరి 3న 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రారంభమైంది. హార్ట్‌ఫుల్ నెస్ గురూజీ కమ్లేష్ డి.పటేల్ ఆధ్వర్యంలో జనవరి 3న ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శర్భానంద సోనోవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగా గురు రామ్‌దేవ్ బాబా, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలసి అంతర్జాతీయ యోగా అకాడమీకి మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు వీరంతా కలసి ‘ది అథెంటిక్ యోగా’పుస్తకాన్ని ఆవిష్కరించారు.
చదవండి: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఉన్న ఏకైక మహిళా ఎంపీ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 75 కోట్ల సూర్య నమస్కారాల కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శర్భానంద సోనోవాల్
ఎక్కడ : కాన్హా శాంతి వనం, కాన్హా గ్రామం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా
ఎందుకు : అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్