Skip to main content

Taj Mahal: మూసి ఉన్న 22 గదుల చిత్రాలు విడుదల.. గదుల్లో ఏముందంటే..

Taj-Mahal-22-rooms

ప్రపంచంలోని అతిగొప్ప కట్టడాల్లో ఒకటైన తాజ్‌ మహల్‌లోని మూసి ఉన్న 22 గదుల చిత్రాలను భారత పురావస్తుశాఖ విడుదల చేసింది. 22 గదుల చిత్రాలను పురావస్తుశాఖ వెబ్‌సైట్‌లో పెట్టినట్లు మే 16న అధికారులు వెల్లడించారు. తాజ్‌ మహల్‌లోని మూసి ఉంచిన గదుల గురించి అసత్య ప్రచారాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మూసి ఉంచిన గదుల్లో ఎటువంటి శాసనాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. గదులన్నీ ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.

GK Awards Quiz: 94వ ఆస్కార్ అవార్డ్స్ 2022లో "ప్రధాన పాత్రలో ఉత్తమ నటి" అవార్డును గెలుచుకున్నది?

ఏమిటీ వివాదం?

  • తాజ్‌ మహల్‌లో మూసి ఉంచిన 22 గదులను తెరవాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో ఇటీవల ఓ పిటషన్‌ దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషన్‌ను కోర్టు కొట్టివేసినప్పటికీ.. పురావస్తు శాఖ అధికారులు ఆ 22 గదుల చిత్రాలను విడుదల చేశారు.
  • తాజ్‌ మహల్‌లోని మూసివుంచిన 22 గదుల్లో హిందూ శాసనాలు, దేవతా విగ్రహాలు ఉన్నాయంటూ కొందరు వ్యక్తులు వాదించారు. అయితే ఈ వాదనలపై స్పందించిన భారత పురావస్తుశాఖ అధికారులు.. ఆ గదుల్లో ఏమిలేదని మొదట నుంచి వివరణ ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై చెలరేగిన వివాదానికి తెరదించేందుకు పురావస్తు శాఖ.. 22 గదుల చిత్రాలను విడుదల చేసింది.

ఆగ్రా నగరంలోని యమునా నది తీరాన 17వ శతాబ్దంలో నిర్మించిన సమాధి తాజ్‌ మహల్‌. తమ 14వ బిడ్డకు జన్మినిస్తూ మరణించిన భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్థం మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ అద్భుతమైన స్మారకాన్ని ఇటుక, ఎర్రని ఇసుకరాయి, పాలరాతితో నిర్మించారు. భారత్‌లోని అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా తాజ్‌ నిలిచింది.

Wheat Exports: గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన దేశం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 May 2022 03:34PM

Photo Stories