Skip to main content

Air India prepares one of largest aircraft deals in history: ఎయిర్‌ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్‌క్రాప్ట్‌ డీల్‌

Air India prepares one of largest aircraft deals in history
  • ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ దాదాపు 300 నారోబాడీ జెట్లను ఆర్డర్‌ చేసేందుకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇది విమానాయన చరిత్రలో అతి పెద్ద ఆర్డర్‌లలో ఒకటి అని స్పష్టం చేశాయి. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్‌లైన్‌ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో తన విమానాలను సరిదిద్దాలని చూస్తోంది. ఈ మేరకు క్యారియర్‌ ఎయిర్‌బస్‌ A320neo ఫ్యామిలీ జెట్‌లు లేదా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ మోడల్‌ లేక రెండింటిని మిక్స్ చేసి సరికొత్త మోడల్స్‌ని ఆర్డర్‌ చేయవచ్చునని అధికారులు అంటున్నారు.
  • దేశంలో ఎయిర్‌బస్‌ ఆధిపత్యం చెలాయిస్తున్నందున భారత్‌ ఈ నారోబాడీ జెట్‌ ఆర్డర్‌ని గెలుచుకోవడం బోయింగ్‌ విమానాలను తిరుగుబాటుగా అయ్యింది. ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ ద్వారా నిర్వహించబడుతున్న ఇండిగో అత్యధికంగా అమ్ముడై నారోబాడీల కోసం యూరోపియన్‌ తయారీదారులకు ప్రపంచంలోనే అతిపెద్ద కస్టమర్‌గా మారింది. పైగా సుమారు 700 నారోబాడీలను ఆర్డర్‌ చేస్తోంది. గో ఎయిర్‌లైన్స్ ఇండియా లిమిటెడ్, ఎయిర్‌ఏషియా ఇండియా లిమిటెడ్‌తో సహా ఇతర సంస్థలు ఒకేతరహా విమానాలను నడుపుతున్నాయి.
  • సుమారు 300 విమానాల ఉత్పత్తికి,  డెలివరీకి సంవత్సరాలు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చునని అధికారుల చెబుతున్నారు. ఎయిర్‌బస్ ఒక నెలలో దాదాపు 50 నారోబాడీ జెట్‌లను నిర్మిస్తుంది, 2023 కల్లా వాటిని 65కి, 2025 నాటికి 75కి పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రైవేటీకరణలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలోనే టాటా ఎయిర్‌లైన్‌ను కొనుగోలు చేసింది. ఇది నాలుగు ఎయిర్‌లైన్ బ్రాండ్‌లతో సహా దాని విమానయాన వ్యాపారాలను ఏకీకృతం చేయాలని భావిస్తోంది. కొత్త విమానాల కోసం చేస్తున్న ఆర్డర్ డీల్‌ ముఖ్యంగా దీర్ఘకాలిక నిర్వహణపై అనుకూలమైన నిబంధనలతో ఖర్చులను తగ్గించుకోవడం తోపాటు చాలా చౌక ధరల్లో కొనుగోలు చేసి..ప్రత్యర్థులతో మెరుగ్గా పోటీ పడడంలో సహాయపడుతుంది.
  • Download Current Affairs PDFs: Click Here
  • యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
    డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌
Published date : 20 Jun 2022 05:50PM

Photo Stories