Voter Registration: ఆధార్ తప్పనిసరి కాదు
ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, వివరాల దిద్దుబాటు, చిరునామా మార్పు తదితర అవసరాలకు సంబంధించిన కొత్త దరఖాస్తుల విధానం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. ఓటర్ల జాబితాలను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసే కసరత్తు కూడా దేశ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. అయితే ఓటర్లు తమ ఆధార్ నంబర్‌ను తెలపడం మాత్రం తప్పనిసరికాదు. కాగా కొత్త విధానంలో భాగంగా ఇకపై 17 ఏళ్ల వయస్సు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కలగనుంది. ఓటర్ల నమోదు దరఖాస్తుల ప్రక్రియను సరళీకృతం చేయడానికి వీలుగా ఆగస్టు 1 నుంచి ఈ కింది మార్పులను అందుబాటులోకి తెచ్చినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Also read; CWG 2022 : మీరాబాయి చానుకి స్వర్ణం
ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి నుంచి ఆధార్ నంబర్లు సేకరించడానికి కొత్త దరఖాస్తును (ఫారం–6బీ) అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్ ఇవ్వలేదన్న కారణంతో ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేర్లను తొలగించరాదని, జాబితాలో కొత్తగా పేరును చేర్చడానికి నిరాకరించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా ఆధార్ నంబర్ ఇస్తేనే తీసుకోవాలని, బలవంతం చేయరాదని సూచించింది. ఓటర్ల జాబితాలను ప్రకటించినప్పుడు ఓటర్ల ఆధార్ నంబర్లు బహిర్గతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఓటర్ల జాబితాను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేస్తే పౌరుల గోప్యతకు ప్రమాదం ఏర్పడుతుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా, ఎన్నికల సంఘం ఈ దిశగా ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP