Skip to main content

National Crime Records Bureau: 2020 సంవత్సరంలో 1.53 లక్షల ఆత్మహత్యలు

Suicide

2020 సంవత్సరంలో రోజుకు 418 చొప్పున మొత్తం 1,53,052 బలవన్మరణాలు సంభవించాయి. ఇందులో వ్యవసాయ రంగానికి చెందిన 10,677 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతకుముందు, 2019 ఏడాదిలో మొత్తం 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అక్టోబర్‌ 29న విడుదలైన నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • ఆత్మహత్యల రేటు ప్రతి వెయ్యి మందికి 2019లో 10.4 శాతం ఉండగా 2020లో అది 11.3 శాతానికి పెరిగింది.
  • 2020లో వ్యవసాయ రంగానికి చెందిన 10,677 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో 5,579 మంది రైతులు, 5,098 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. 
  • మొత్తం 1,53,052 ఆత్మహత్యల్లో 7 శాతం మంది సాగు రంగానికి చెందిన వారే.
  • ఆత్మహత్యల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19,909, ఆతర్వాత తమిళనాడులో 16,883, మధ్యప్రదేశ్‌లో 14,578, పశ్చిమ బెంగాల్‌లో 13,103, కర్ణాటకలో 12,259 చేసుకున్నాయి. మొత్తం బలవన్మరణాల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 50.1 శాతం వరకు ఉన్నాయి.

చ‌ద‌వండి: విరాళాల సేకరణలో అగ్రస్థానంలో నిలిచిన ప్రాంతీయ పార్టీ?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Oct 2021 04:58PM

Photo Stories