Skip to main content

Lok Sabha Elections 2024: ప్ర‌స్తుతం భారత దేశంలో ఓటర్ల సంఖ్య ఎంతంటే..!

భార‌త‌దేశంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మందికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
Indian Democracy    Lok Sabha Polls 2024   2024 Lok Sabha Elections 96 Crore Citizens In India  Election Commission Reports 96 Crore Voters for India's General Elections

2019 నాటికి ఈ సంఖ్య 91.20 కోట్లుగా ఉన్నట్టు ఈసీ వివరాల్లో తెలిపింది.  
కాగా, దేశంలో ఓటర్లకు సంబంధించి ఈసీ వివరాలను వెల్లడించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని తెలిపింది. వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారని ఈసీ స్పష్టంచేసింది. అదేవిధంగా మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మందికి పైగా 18-19 ఏండ్ల వయసు ఉన్నవారేనని తెలిపింది. 

ఇక, ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, దాదాపు 1.5 కోట్ల మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించనున్నట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పంపిన ఓ లేఖ ప్రకారం.. దేశంలో 1951లో 17.32 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉండగా.. 2019 నాటికి ఈ సంఖ్య 91.20 కోట్లకు చేరింది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. గత పార్లమెంటు ఎన్నికల్లో 67 శాతంగా ఉంది.

California schools: కాలిఫోర్నియాలో కలిపిరాత మస్ట్‌.. ఎందుకు అంటే..?

Published date : 27 Jan 2024 01:16PM

Photo Stories