142 dead, 5,995 FIRs filed: కేవలం రెండు నెలల్లో...142 మరణాలు... అక్కడ ఏం జరుగుతోంది..?
మణిపూర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
గత రెండు నెలలుగా జరుగుతున్న మణిపుర్ హింసాకాండలో మొత్తం 142 మంది మరణించారని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 5,995 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, 6,745 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రధాన కార్యదర్శి వినీత్ జోషి తెలిపారు.
Telugu Topper IFS Success Story: కరెంట్ అఫైర్స్ కోసం వీటినే ఫాలో అయ్యా... యూట్యాబ్ సాయంతో కోచింగ్ లేకుండానే ఫస్ట్ ర్యాంకు సాధించానిలా...
రిజర్వేషన్ల విషయంలో మణిపూర్‌లో అగ్గిరాజుకుంది. మే నుంచి అది రాష్ట్రాన్ని దహించి వేస్తోంది. మే నెల నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు ఐదు వేల ఘటనలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు అందజేసిన నివేదికలో పేర్కొంది. ఘర్షణలు అధికంగా ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో చోటుచేసుకున్నాయని, ఆ ఘర్షణల్లోనే అధిక మరణాలు సంభవించినట్టు నివేదిక వెల్లడించింది. పరిస్థితులు కుదుటపడేవరకు కర్ఫ్యూ ను పొడిగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.