WSDS 2022: ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు థీమ్ ఏమిటీ?
21వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు–2022(డబ్ల్యూఎస్‌డీఎస్–2022)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 16న ప్రారంభించారు. వర్చువల్ విధానం ద్వారా ఫిబ్రవరి 18 వరకు జరిగే ఈ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వచ్చే రెండు దశాబ్దాల్లో భారతీయుల ఇంధన అవసరాలు రెట్టింపవుతాయని అంచనా వేశారు. ఇతర దేశాలకు ఆర్థిక, సాంకేతిక సాయం అందిస్తామన్న మాటను అభివృద్ధి చెందిన దేశాలు నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ప్రపంచ జాతుల్లో 8 శాతం జీవజాతులకు భారత్ ఆవాసమని, అందువల్ల ఆవరణ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని ఆయన హితవు చెప్పారు. ది ఎరర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్(టీఈఆర్‌ఐ) నిర్వహిస్తున్న ఈ సదస్సులో 100 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. టీఈఆర్‌ఐ ప్రధాన కార్యాలయం భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో ఉంది.
డబ్ల్యూఎస్‌డీఎస్–2022 థీమ్..
టువర్డ్స్ ఏ రీసైలెంట్ ప్లానెట్: ఎన్సూరింగ్ ఏ సస్టెయినబుల్ అండ్ ఈక్వీటబుల్ ఫ్యూచర్(Towards a Resilient Planet: Ensuring a Sustainable and Equitable Future)
చదవండి: ఏ దేశం నుంచి భారత్‌కు పెను సవాళ్లున్నాయని అమెరికా వెల్లడించింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 21వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు–2022(డబ్ల్యూఎస్‌డీఎస్–2022 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో..
ఎందుకు : సుస్థిరాభివృద్ధి అంశాలపై చర్చించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్