Skip to main content

Pathan Movie: 2 రోజుల్లో.. రూ.200 కోట్లు వసూలు చేసిన ‘పఠాన్‌’

బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారూక్‌ ఖాన్, దీపికా పదుకోన్‌ నటించిన పఠాన్‌ మూవీ భారీగా వసూళ్లు సాధిస్తోంది.

జ‌న‌వ‌రి 25న విడుదలైన ఈ చిత్రం తొలి రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారూక్‌కు పెద్ద విజయం దక్కింది. ‘‘వెనక్కి తిరిగిరావడం కోసం ప్లాన్‌ చేసుకోవద్దు. మున్ముందుకే అడుగులు వేయాలి. వెనక్కి తగ్గొద్దు. ప్రారంభించిన పనిని ముగించేందుకు ప్రయత్నించండి’’ అని సోషల్‌ మీడియాలో కింగ్‌ఖాన్‌ సూచించారు. చిత్ర విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పఠాన్‌ చిత్రాన్ని ప్రఖ్యాత యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. 

Mohammed Azmat Ali Khan: 9వ నిజాంగా మహ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌

Published date : 28 Jan 2023 03:24PM

Photo Stories