US Forces: అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తి
అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదంపై అమెరికా చేసిన 20 ఏళ్ల యుద్ధం ముగిసింది. అమెరికాకు చెందిన సీ–17 చిట్టచివరి విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి ఆగస్టు 31న బయలుదేరింది. 2021, ఆగస్టు 31లోగా తమ బలగాలను అఫ్గాన్ నుంచి ఉపసంహరిస్తామని తాలిబన్లకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్ల మా మిలటరీ మిషన్ ముగిసింది’’ అని బైడెన్ ప్రకటించారు. ఇంకా అఫ్గాన్ నుంచే వచ్చే వారి ప్రయాణాలకు తాలిబన్లు అడ్డంకులు సృష్టించకూడదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చేసిందని బైడెన్ గుర్తు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆఫ్గానిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తి
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : అమెరికా
ఎక్కడ : ఆఫ్గానిస్తాన్
ఎందుకు : తమ బలగాలను అఫ్గాన్ నుంచి ఉపసంహరిస్తామని తాలిబన్లకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చినందున...