ఉక్రెయిన్‌కు జీ7 బాసట
రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని జర్మనీలోని ఎల్మౌలో జరుగుతున్న జి7 సదస్సు వేదికగా సభ్య దేశాధినేతలు ప్రతినబూనారు. యుద్ధం కాలంలో, తర్వాత కూడా మద్దతిస్తూనే ఉంటామన్నారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సదస్సునుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేనందున తమకు సాయంపై పశ్చిమ దేశాలు వెనుకంజ వేస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని జి7 దేశాధినేతలు కొట్టిపారేశారు. రష్యా నుంచి దిగుమతులపై సుంకాలను భారీగా పెంచాలని నిర్ణయించారు.
also read:G7 Summit Germany: జీ7 సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
ఉక్రెయిన్‌కు నానామ్స్ సిస్టమ్
అత్యాధునిక యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ ‘నాసమ్స్’ను ఉక్రెయిన్ అందించాలని అమెరికా నిర్ణయించింది. కౌంటర్–బ్యాటరీ రాడార్లు కూడా ఇవ్వనుంది. 7.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయమూ అందజేస్తామని బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి జి7 సహకారం కొనసాగిస్తూనే ఉండాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.
Also read: Infectious Diseases: అంటు వ్యాధులపై పోరుకు అమెరికా నిధులు