Western Asia: ప్రైవేట్ డ్రోన్లపై నిషేధం విధించిన అరబ్ దేశం?
దేశంలో ప్రైవేట్ డ్రోన్ల కార్యకలాపాలను నిషేధిస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) ప్రభుత్వం జనవరి 22న ప్రకటించింది. ప్రైవేట్ డ్రోన్లతో పాటు ప్రైవేట్ లైట్ స్పోర్ట్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా నెలపాటు నిషేధిస్తున్నామని తెలిపింది. ఇటీవలే అబుదాబిలో హౌతి తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో ముగ్గురు మరణించారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. జనవరి 22నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఇటీవల కాలంలో వీటి దుర్వినియోగం పెరిగిందని, అనుమతించిన పరిధులు దాటి ఇతర ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవడం కూడా ఎక్కువైందని పేర్కొంది. సినిమా షూటింగ్‌లకు మాత్రం ఈ నిషేధం వర్తించదని వివరించింది.
డబ్ల్యూహెచ్‌ఎంఓ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి?
అమెరికా అధ్యక్ష భవనం ‘‘వైట్‌హౌస్’’ మిలటరీ ఆఫీస్ డైరెక్టర్ పదవికి భారతీయ సంతతికి చెందిన మజ వర్గీస్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నానని, ఈ పదవిని నిర్వహించడం తనకు గర్వకారణమని ఆయన జనవరి 22న వెల్లడించారు. గతంలో ఒబామా ప్రభుత్వంలో కూడా మజు పనిచేశారు. వృత్తిరీత్యా మజు న్యాయవాది. ఆయన తల్లిదండ్రుల స్వస్థలం కేరళ.
చదవండి: యెమెన్‌లోని జైలుపై వైమానిక దాడి చేసిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రైవేట్ డ్రోన్ల కార్యకలాపాలపై నిషేధం విధించిన దేశం?
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ) ప్రభుత్వం
ఎక్కడ : యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్(యూఏఈ)
ఎందుకు : ఇటీవలే అబుదాబిలో హౌతి తిరుగుబాటుదారులు దాడి జరిపిన నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్