NATO Membership: నాటోలో స్వీడన్ చేరికకు తుర్కియే ఆమోదం
Sakshi Education
నాటోలో స్వీడన్ సభ్యత్వానికి తుర్కియే జనవరి 25వ తేదీ అధికారికంగా ఆమోదం తెలిపింది.
హంగేరీ కూడా ఓకే చెబితే నార్డిక్ దేశం స్వీడన్ నాటో దేశంగా మారిపోనుంది. ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనకు తుర్కియే పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. నాటో సభ్యదేశమైన తుర్కియే ఫిన్లాండ్ సభ్యత్వానికి మాత్రమే సమ్మతం తెలిపింది. స్వీడన్ సభ్యత్వంపై అభ్యంతరం తెలుపుతూ వస్తోంది. వాటికి కూడా తగు పరిష్కారం దొరకడంతో తాజాగా ఆమోదం తెలిపింది. ఇక, నాటోలో స్వీడన్ చేరికపై హంగరీ పార్లమెంట్‌లో ఫిబ్రవరి ఆఖరులో చర్చించొచ్చని భావిస్తున్నారు.
Donald Trump: తొలి ప్రైమరీలో ట్రంప్‌దే గెలుపు.. అత్యధికంగా 51 శాతం ఓట్లు కైవసం
Published date : 29 Jan 2024 11:01AM