Russia-Ukraine War: ఉక్రెయిన్‌లోని ఏ కీలక నగరం రష్యా వశమైంది?
ఉక్రెయిన్‌లోని కీలక నగరం మారియుపోల్ తమ వశమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏప్రిల్ 21న ప్రకటించారు. నగరంలో మిగిలిన ఉక్రెయిన్ బలగాలను వెతికే పని పెట్టుకోకుండా బయటనుంచి ఎలాంటి సాయం అందకుండా కట్టుదిట్టం చేయాలని తన సేనలకు సూచించారు. చాలారోజులుగా ఈ నగరాన్ని వశం చేసుకోవాలని రష్యా యత్నిస్తోంది. దీనివల్ల రష్యన్లకు క్రిమియాతో నేరుగా రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు దక్కిన తొలి పెద్ద విజయం ఇదే. అయితే నగరంలోని స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి కొన్ని రోజులు పట్టవచ్చని రష్యా రక్షణ మంత్రి సెర్గి షోయిగు చెప్పారు.
ఇంకొన్ని విషయాలు..
- రష్యా పౌర హననానికి పాల్పడుతుందంటూ లాట్వియా పార్లమెంట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రష్యా చమురు దిగుమతిని ఈయూ దేశాలు తక్షణం నిలిపివేయాలని కోరింది.
- ఉక్రెయిన్ యుద్ధంలో సంధిని పాటించాలని పోప్ ఫ్రాన్సిస్ మరోమారు పిలుపునిచ్చారు. కాథలిక్ ఈస్టర్ సందర్భంగా ఇరుదేశాలు కాల్పుల విరమణ పాటించాలన్న ఐరాస చీఫ్ విజ్ఞప్తితో ఏకీభవిస్తున్నానని తెలిపారు.
- రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్యదేశాలు తమపై ఒత్తిడి చేస్తున్నాయని, అందువల్ల ఈయూలో చేరడంపై పునరాలోచిస్తామని సెర్బియా మంత్రి అలెక్సాండర్ చెప్పారు.
- ఆంక్షల భయంతో రష్యాలో బ్యాంకింగ్ సేవలకు చైనా క్రెడిట్ కార్డ్ సంస్థ యునియన్ పే వెనుకాడిందని వార్తలు వచ్చాయి.
- జెలెన్‌స్కీతో చర్చల కోసం స్పెయిన్, డెన్మార్క్ ప్రధానులు కీవ్‌కు వచ్చారు.
- లుహాన్స్‌క్ ప్రాంతంలో 80 శాతం ప్రస్తుతం రష్యా అధీనంలో ఉందని ఆ ప్రాంత గవర్నర్ వెల్లడించారు. రష్యా దాడికి ముందు ఇందులో 60 శాతం ఉక్రెయిన్ ఆధీనంలో, 40 శాతం తిరుగుబాటుదారుల అధీనంలో ఉండేది.
- ఉక్రెయిన్‌కు అదనపు మిలటరీ, ఆర్థిక సాయం అందించే ప్యాకేజీని జోబైడెన్ ప్రకటిస్తారని అమెరికా అధికారులు తెలిపారు.
- యూఎస్‌కు చెందిన కెనడీ అవార్డుకు జెలెన్‌స్కీతో పాటు ఐదుగురిని ఎంపిక చేశారు.
- ఉక్రెయిన్‌కు సాయాన్ని మరింత పెంచుతామని అమెరికా, వివిధ పాశ్చాత్య దేశాలు ప్రకటించాయి.
Economic Crisis: ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉక్రెయిన్‌లోని కీలక నగరం మారియుపోల్ తమ వశమైందని ప్రకటన
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
ఎందుకు : రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్