Power Cut: మధ్యాసియాలోని ఏ దేశాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తింది?
మధ్యాసియా దేశాలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్‌ల్లో జనవరి 25న విద్యుత్ సంక్షోభం తలెత్తింది. చాలా నగరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ దేశాల్లో హఠాత్తుగా తలెత్తిన విద్యుత్ సరఫరా అంతరాయంతో పలు పౌర సేవలు నిలిచిపోయాయి. ఈ అంతరాయానికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే కజకిస్తాన్‌లో పవర్‌లైన్ ఫెయిల్యూర్ ఇందుకు కారణమని ఉజ్బెకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ మూడు దేశాలు వన్ పవర్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నాయి.
కజకిస్తాన్..
రాజధాని: నూర్–సుల్తాన్; కరెన్సీ: టెంజె
ఉజ్బెకిస్తాన్..
రాజధాని: తాష్కెంట్; కరెన్సీ: ఉజ్బెక్ సోమ్
కిర్గిస్తాన్..
రాజధాని: బిష్కెక్; కరెన్సీ: కిర్గిస్తానీ సోమ్
ఉత్తరకొరియా క్రూయిజ్ క్షిపణి పరీక్షలు
ఉత్తరకొరియా జనవరి 25న రెండు క్రూయిజ్ క్షిపణి పరీక్షలు జరిపినట్లు దక్షిణకొరియా మిలటరీ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెలలో ఉత్తర కొరియా ఐదుమార్లు ఆయుధ పరీక్షలు జరిపినట్లయింది. ఇటీవల కాలంలో అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో ఉత్తరకొరియా దూకుడు పెంచింది. తమపై ఆంక్షలు ఎత్తివేయాలని ఉత్తరకొరియా డిమాండ్ చేస్తోంది. లేదంటే 2018లో నిలిపివేసిన అణ్వాయుధ పరీక్షలు తిరిగి ఆరంభిస్తామని హెచ్చరిస్తోంది.
చదవండి: కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్‌లో భారత్ స్థానం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్