Transparency International: కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్‌లో భారత్ స్థానం?
జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌కు చెందిన ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 180 దేశాలతో కూడిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్–2021(సీపీఐ–2021)ను విడుదల చేసింది. ఈ జాబితాలో 180 దేశాలకు 0– 100 (అత్యధిక అవినీతి– శూన్య అవినీతి)రేంజ్‌లో మార్కులు ఇచ్చారు. గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో 86 శాతం దేశాలు అవినీతి నిర్మూలనలో పెద్దగా పనితీరు కనబరచలేదని సంస్థ పేర్కొంది.
కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్–ముఖ్యాంశాలు..
- ఈ జాబితాలో 40 మార్కులతో భారత్ 85వ స్థానంలో నిలిచింది. 28 మార్కులతో పాకిస్తాన్ 140వ స్థానంలో నిలిచింది. ఇక బంగ్లాదేశ్ 147వ స్థానం పొందింది.
- పాక్‌లో రూల్ ఆఫ్ లా లేకపోవడమే అవినీతి పెరగడానికి కారణమని సంస్థ విశ్లేషించింది.
- జాబితాలో 88 స్కోరుతో డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్‌లు అవినీతి తక్కువగా ఉన్న దేశాలుగా నిలిచాయి. వీటి తర్వాత స్థానాల్లో నార్వే, సింగపూర్, స్వీడన్ ఉన్నాయి.
- భారీ అవినీతిమయ దేశాల్లో దక్షిణ సూడాన్, సిరియా, సోమాలియా, వెనుజులా, అఫ్గాన్ ఉన్నాయి.
- ప్రపంచ దేశాల సరాసరి సీపీఐ స్కోరు 43 వద్ద ఉందని సంస్థ తెలిపింది. ప్రపంచదేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు ఇప్పటికీ 50 స్కోరు దిగువనే ఉన్నాయని పేర్కొంది.
చదవండి: ఆఫ్రికాలోని ఏ దేశాధ్యక్షుడిని సైనికులు బంధించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్–2021(సీపీఐ–2021)లో భారత్‌కు 85వ స్థానం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ
ఎక్కడ : ప్రపంచంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్