Military Coup: ఆఫ్రికాలోని ఏ దేశాధ్యక్షుడిని సైనికులు బంధించారు?
పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరెను బంధించామని ఆ దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు జనవరి 24న ప్రకటించారు. అధ్యక్షుడిని ఎక్కడ దాచింది వెల్లడించలేదు. జనవరి 23న సైనిక శిబిరాల వద్ద మొదలైన కాల్పుల కలకలం జనవరి 24న కూడా కొనసాగింది. అధ్యక్ష భవనం వద్ద చిన్నపాటి యుద్దం జరిగింది. రాజధానిలో తిరుగబాటు సైనికులు గస్తీ కాస్తున్నారు. తొలుత ఇది తిరుగుబాటు కాదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ చివరకు సైనికుల చేతికి ప్రెసిడెంటే బందీగా చిక్కారు.
2015 నుంచి..
2015 నుంచి బుర్కినాకు కబోరె అధిపతిగా ఉన్నారు. దేశంలో జరుగుతున్న ఉగ్రచర్యలతో మిలటరీ తీవ్రంగా నష్టపోతోంది. తమకు సరైన సదుపాయాలు లేవని సైనికులు అసంతృప్తిగా ఉన్నారు. ఇది చివరకు తిరుగుబాటకు దారితీసింది. తిరుగుబాటుకు ప్రజల్లో కూడా మద్దతు ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు తెలిపారు.
బుర్కినా ఫాసో..
రాజధాని: ఔగాడౌగౌ; కరెన్సీ: వెస్ట్ ఆఫ్రికన్ సీఎఫ్‌ఏ ఫ్రాంక్
అధికార భాష: ఫ్రెంచ్
చదవండి: ప్రైవేట్ డ్రోన్లపై నిషేధం విధించిన అరబ్ దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆఫ్రికాలోని ఏ దేశాధ్యక్షుడిని ఆ దేశ సైనికులు బంధించారు?
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరె
ఎందుకు : సైనిక తిరుగుబాటు చేసి..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్