Skip to main content

North Korea: ఇటీవల క్రూయిజ్‌ క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఆసియా దేశం?

సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే క్రూయిజ్‌ క్షిపణి పరీక్షలు ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించింది. సెప్టెంబర్‌ 11, 12వ తేదీల్లో వరుసగా రెండు రోజులు నిర్వహించిన ఈ క్షిపణి పరీక్షలు విజయవంతమైనట్టుగా ఆ దేశ అధికారిక కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ సెప్టెంబర్‌ 13న వెల్లడించింది.
North Korea tests new long-range cruise missile

అమెరికాతో అణు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఉత్తర కొరియా తమ ఆయుధ సత్తాను ప్రపంచ దేశాలకు చాటాలన్న ఉద్దేశంతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కొత్త క్షిపణి 1,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. ఉ.కొరియాపై శత్రువులు ఎవరైనా దాడి చేస్తే దానిని గుర్తించి సమర్థంగా తిప్పికొట్టి రక్షణని కల్పించే సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. బాలిస్టిక్‌ క్షిపణులు, అణ్వాయుధాల తయారీపై అంతర్జాతీయంగా ఉత్తరకొరియాపై ఆంక్షలున్నాయి. కానీ క్రూయిజ్‌ క్షిపణులపై ఎలాంటి ఆంక్షలు లేవు.

చ‌దవండి: 2021 ఏడాది జరిగిన బ్రిక్స్‌ దేశాల 13వ సదస్సు థీమ్‌ ఏమిటీ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే క్రూయిజ్‌ క్షిపణి పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన దేశం?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 11, 12
ఎవరు    : ఉత్తర కొరియా 
ఎక్కడ    : ఉత్తర కొరియా
ఎందుకు  : రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు...

Published date : 14 Sep 2021 01:25PM

Photo Stories