Skip to main content

Neeraj Chopra: స్విట్జర్లాండ్ ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్‌గా నీరజ్ చోప్రా

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఒలింపిక్ స్వర్ణ పతాక విజేత నీరజ్ చోప్రాను స్విట్జర్లాండ్ టూరిజం ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్‌గా నియ‌మించింది.

ఈ మేర‌కు నీర‌జ్ చోప్రా ప్రతిభావంతులైన భారతీయ క్రీడాకారులు, ప్ర‌యాణికుల‌కు స్విట్జర్లాండ్‌లోని సాహసోపేతమైన, స్పూర్తిదాయ‌క‌మైన‌, అద్భుతమైన ప్ర‌దేశాల‌పై ప్రచారం చేయ‌నున్నారు. ఆ దేశంతో తనకు ఉన్న‌ అనుభవాలు, మంచులో కాలిన‌డ‌క‌న‌, బైక్‌లో సుల‌బంగా వెళ్ల‌డానికి మార్గం చూప‌నున్నారు. 
మంచు క్రీడల్లో ఉత్తమ ప్రదర్శన క‌న‌బ‌ర‌చ‌డానికి ఎలా కృషి చేయాలో వివ‌రించ‌నున్నారు.

Published date : 15 Nov 2022 04:06PM

Photo Stories