Skip to main content

Liz Truss: బ్రిటన్‌ మూడో మహిళా పీఎంగా రికార్డు

బ్రిటన్‌ ప్రధాని పీఠం కోసం జరిగిన పోరులో విదేశాంగ మంత్రి మేరీ ఎలిజబెత్‌ (లిజ్‌) ట్రస్‌ (47)దే పై చేయి అయింది.
Liz Truss wins to become UK's 15th Prime Minister
Liz Truss wins to become UK's 15th Prime Minister

హోరాహోరి పోరులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42)పై ఆమె విజయం సాధించి కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. తద్వారా బోరిస్‌ జాన్సన్‌ వారసురాలిగా ప్రధాని పదవి చేపట్టనున్నారు. సెప్టెంబర్ 5 న వెల్లడైన ఫలితాల్లో ట్రస్‌ 81,326 ఓట్లు సాధించారు. రిషికి 60,399 ఓట్లు పోలయ్యాయి. 

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తున్నారు?

మార్గరెట్‌ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్‌ ప్రధాని కానున్న మూడో మహిళ ట్రస్‌. తాత్కాలిక ప్రధాని జాన్సన్‌ లాంఛనంగా రాజీనామా సమర్పించిన అనంతరం మంగళవారం ట్రస్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 5th కరెంట్‌ అఫైర్స్‌

అంచెలంచెలుగా ఎదిగి... 
బ్రిటన్‌ నూతన ప్రధాని లిజ్‌ ట్రస్‌ కరడుగట్టిన కమ్యూనిస్టుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. తండ్రి మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌ కాగా తల్లి నర్స్‌ టీచర్‌. యూకేలో పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. 2001, 2005ల్లో ఓటమి పాలైనా 2010లో నార్‌ఫోక్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో కేమరూన్‌ కేబినెట్లో పర్యావరణ మంత్రిగా, 2016లో థెరిసా మే ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా చేశారు. 2019లో బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని అయ్యాక ట్రస్‌కు ప్రాధాన్యం పెరిగింది. తొలుత ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భారత్‌లో పటిష్టమైన ఆర్థిక బంధం కోసం కృషి చేశారు. భారత్‌–ఇంగ్లండ్‌ వర్తక భాగస్వామ్యం (ఈటీపీ)లో కీలక పాత్ర పోషించారు. రెండేళ్లకు కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు జాన్సన్‌ వారసురాలిగా ఎన్నికయ్యారు. అకౌంటెంట్‌ హ్యూ ఓ లియరీని ట్రస్‌ పెళ్లాడారు. వారికి ఇద్దరమ్మాయిలు. పరిస్థితిని బట్టి విధానాలు మార్చుకునే నేతగా కూడా ట్రస్‌ పేరుబడ్డారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడాన్ని (బ్రెగ్జిట్‌) తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అది అనివార్యమని తేలాక బ్రెగ్జిట్‌కు జైకొట్టారు. కన్జర్వేటివ్‌ సభ్యుల మద్దతు సాధించే ప్రయత్నాల్లో భాగంగా మాజీ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ వస్త్రధారణను అనుకరించారు.

Also read: Weekly Current Affairs (National) Bitbank: భారతదేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా కింది వాటిలో ఏది ఆమోదించబడింది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 06 Sep 2022 04:15PM

Photo Stories