జులై 2017 అంతర్జాతీయం
Sakshi Education
భారత్‌పై అణుదాడి చేద్దామనుకున్నా : ముషార్రఫ్
2002 ఏడాదిలో భారత్‌పై అణ్వస్త్రాలను ప్రయోగించాలా వద్దా అన్నదానిపై తాను తీవ్రంగా ఆలోచించినట్లు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఇటీవల తెలిపారు. 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో తనకు అణ్వాయుధాలను ప్రయోగించాలన్న ఆలోచన వచ్చిందనీ, కానీ భారత్ వైపు నుంచి ప్రతిదాడులు జరుగుతాయన్న భయంతో ఆగిపోయానని ముషార్రఫ్ ఓ జపాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఆలోచనలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన గుర్తుచేసుకున్నారు.
1999 అక్టోబరులో నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆర్మీ తిరుగుబాటు ద్వారా కూలదోసి 2001 నుంచి 2008 వరకు ముషార్రఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. వైద్య చికిత్సల నెపంతో పాకిస్తాన్ విడిచి వచ్చి ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు.
బిల్‌గేట్స్‌ను అధిగమించిన బెజోస్
ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి చేరారు. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను కూడా దాటేశారు. ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు జూలై 27న అమెజాన్ షేరు ధర ఒక్కసారిగా దూసుకుపోవడంతో... బెజోస్ సంపద నికర విలువ ఏకంగా 90.9 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ప్రస్తుతం బిల్ గేట్స్ సంపద అంతకన్నా కాస్త తక్కువగా 90.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ కుబేరులలో తొలి స్థానానికి అమెజాన్ వ్యవస్థాపకుడు
ఎప్పుడు : జూలై 27
ఎవరు : జెఫ్ బెజోస్
ఎందుకు : బిల్ గేట్స్‌ను అధిగమించిన బెజోస్
అమెరికా-మెక్సికో గోడకు 1.6 బిలియన్ డాలర్లు
అమెరికా-మెక్సికో గోడ నిర్మాణానికి 1.6 బిలియన్ డాలర్లు సహా 827 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ జూలై 28న ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు 235-192 ఓట్లతో పాసయింది. ప్రతిపక్ష డెమోక్రాట్ల బలం ఉన్న సెనేట్‌లోనూ ఈ బిల్లు ఆమోదం పొందాలి.
మాదకద్రవ్యాల ప్రవాహం, అక్రమ వలసలను అరికట్టేందుకు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మిస్తానని ఎన్నికల సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా-మెక్సికో గోడ నిర్మాణ బిల్లుకి ఆమోదం
ఎప్పుడు : జూలై 28
ఎవరు : అమెరికా ప్రతినిధుల సభ
ఎక్కడ : అమెరికా
స్విట్జర్లాండ్‌లో ప్రపంచంలోనే అతిపొడవైన వేలాడే వంతెన
స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతంలో జెర్మట్ మ్యాటర్‌హార్న్‌లోని స్విస్ అల్ఫీన్ రిసార్ట్‌లో ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే వంతెనను నిర్మించారు. కేవలం పాదాచారుల కోసమే ఉద్దేశించిన ఈ వంతెన భూ ఉపరితలానికి 85 మీటర్ల ఎత్తులో, 494 మీటర్ల పొడవుతో ఉంది. కేవలం పది వారాల్లోనే నిర్మించిన ఈ వంతెనకు ఛార్లెస్ కువోనెన్ అని పేరు పెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అతిపొడవైన వేలాడే వంతెన
ఎప్పుడు : ఆగస్టు 1
ఎక్కడ : స్విస్ అల్ఫీన్ రిసార్ట్, స్విట్జర్లాండ్
చైనాలో బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశం
రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల కార్మిక మంత్రుల సమావేశాలు చైనాలోని చాంగ్‌కింగ్‌లో జూలై 26న ముగిశాయి. ఈ సమావేశాల్లో మన కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. సమావేశంలో ప్రసంగించిన ఆయన బ్రిక్స్ దేశాల కార్మిక సంస్థల మధ్య సమాచార మార్పిడి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా పరస్పర సహకారాన్ని పెంచుకోవచ్చన్నారు. సుస్థిర ఉద్యోగ కల్పన, జీవన ప్రమాణాల నాణ్యతను పెంచేందుకు పరస్పర సహకారంతో పనిచేస్తామని సమావేశాల ముగింపు సందర్భంగా బ్రిక్స్ దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. సెప్టెంబర్ మొదటి వారంలో చైనాలోని షియామెన్‌లో బ్రిక్స్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు.
రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలు
రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలపై ఆర్థిక ఆంక్షలు విధించే బిల్లును జూలై 25న అమెరికా దిగువసభ (ప్రతినిధుల సభ) భారీ మెజారిటీతో ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 419 మంది, వ్యతిరేకంగా ముగ్గురు ఓటు వేశారు. అమెరికా, దాని మిత్ర దేశాలను చిన్నచూపు చూస్తూ వాటికి వ్యతిరేకంగా ఈ మూడు దేశాలు ప్రమాదకర, యుద్ధోన్మాద కార్యకలాపాలు చేపడుతున్నాయని ఆరోపిస్తూ ఈ చర్య తీసుకుంది. దిగువ సభ ఆమోదంతో బిల్లు సెనేట్(ఎగువ సభ) పరిశీలనకు వెళ్లనుంది. బిల్లును రూపొందించిన ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎడ్ రాయిస్స్ మాట్లాడుతూ ఈ మూడు దేశాలు అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించడంతోపాటు పొరుగు దేశాల్లో అస్థిరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
2040 నుంచి బ్రిటన్‌లో పెట్రోల్, డీజిల్ వాహనాలు నిషేధం
డీజిల్, పెట్రోల్‌తో నడిచే కార్లు, వ్యాన్ల అమ్మకాలను 2040 నుంచి నిషేధిస్తున్నట్లు యూకే పర్యావరణ సెక్రటరీ మైఖేల్ గోవ్ ప్రకటించారు. ఈ మేరకు ‘ఎయిర్ క్వాలిటీ ప్లాన్’ను జూలై 26న బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. 2040 నుంచి అన్ని వాహనాలు పూర్తిగా విద్యుత్‌తో నడిచేలా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు హైబ్రిడ్ వెహికల్స్‌తో సహా ఇతర అన్ని రకాల ఇంజిన్లతో నడిచే వాహనాలపై నిషేధం విధించనుంది. 2040 నుంచి జీరో ఉద్గార వాహనాలే రోడ్లపై నడిచేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 2040 తర్వాత ఉద్గార రహిత వాహనాలనే అమ్మాలని 2011లో బ్రిటన్ ప్రభుత్వం కార్బన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
చైనా ఆర్మీ 90వ వార్షికోత్సంలో ఆయుధాల ప్రదర్శన
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) 90వ వార్షికోత్సవం సందర్భంగా జూలై 30న ఇన్నర్ మంగోలియాలోని ఝరిహెలో భారీ పరేడ్, ఆయుధాల ప్రదర్శన నిర్వహించారు. దీనికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యారు. ఇందులో 12 వేల దళాలు పాల్గొన్నాయి. 100కు పైగా యుద్ధవిమానాలు, 600 రకాల ఆయుధాలను ప్రదర్శించారు. వీటిలో సగం ఆయుధాలు కొత్తగా రూపొందించినవే. 1927, ఆగస్టు 1న మావో జెడాంగ్ నేతృత్వం లోని చైనా కమ్యూనిస్టు పార్టీ పీఎల్‌ఏను స్థాపించింది.
ఉగ్ర ఆశ్రయ దేశాల జాబితాలో పాకిస్తాన్
పాకిస్తాన్‌ను ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలు, ప్రాంతాల జాబితాలో అమెరికా చేర్చింది. జాబితాలో అఫ్ఘానిస్తాన్, సోమాలియా, ఈజిప్టు, లెబనాన్, దక్షిణ ఫిలిప్పీన్‌స, కొలంబియా, వెనిజులా తదితర దేశాలు కూడా ఉన్నాయి.
పాక్‌లో 2016 నుంచి లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలు ఉగ్ర కార్యకలాపాలు, శిక్షణ, నిధుల సేకరణ కొనసాగిస్తున్నా పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకోలేదని ఉగ్రవాదంపై అమెరికా విదేశాంగ శాఖ రూపొందించిన వార్షిక నివేదిక ఆక్షేపించింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులతోపాటు మావోయిస్టుల నుంచి కూడా భారత్ దాడులు ఎదుర్కొంటోందని ఈ నివేదిక పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉగ్రవాద ఆశ్రయ దేశాల్లో పాకిస్తాన్‌ను చేర్చడం
ఎప్పుడు : జూలై 19
ఎవరు : అమెరికా
ఎందుకు : అఫ్ఘాన్ తాలిబాన్, హక్కానీ, లష్కరే, జైషే వంటిఉగ్రసంస్థలపై గట్టి చర్యలు తీసుకోనందుకు
పాక్‌కు సాయంలో కోతపెట్టిన అమెరికా
హక్కానీ నెట్‌వర్క్‌పై సమర్థవంతంగా పోరాడలేదని ఆరోపిస్తూ సంకీర్ణ సాయం కింద పాకిస్తాన్‌కు అందిస్తున్న 90కోట్ల డాలర్లలో 35కోట్ల డాలర్లకు అమెరికా కోతపెట్టింది. హక్కానీ ఉగ్రవాదులను నిర్మూలించడానికి పాక్ తీసుకున్న చర్యలపై తాను సంతృప్తిగా లేనని అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కాంగ్రెస్ డిఫెన్‌స కమిటీకి తెలపడంతో పెంటగాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్తాన్, పాక్‌ల విషయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సమీక్షించనున్న తరుణంలో సాయాన్ని నిలిపివేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాక్‌కు సాయంలో కోత
ఎప్పుడు : జూలై 21
ఎవరు : అమెరికా
ఎందుకు : హక్కానీ నెట్‌వర్క్‌పై సమర్థవంతంగా పోరాడలేదని ఆరోపిస్తూ
అంతర్జాతీయ సోలార్ కూటమిలో చేరిన ఆస్ట్రేలియా
అంతర్జాతీయ సోలార్ కూటమి(ఐఎస్‌ఏ)లో సభ్యదేశంగా ఆస్ట్రేలియా చేరింది. తద్వారా ఈ కూటమిలో చేరిన 35వ దేశంగా ఆస్ట్రేలియా గుర్తింపు పొందింది. అన్ని రంగాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, నిల్వ కోసం 2030 నాటికి వెయ్యి బిలియన్ డాలర్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఐఎస్‌ఏ ఏర్పాటైంది. భారత్, ఫ్రాన్స్ ఈ కూటమిగా నేతృత్వం వహిస్తున్నాయి.
2015 నవంబర్‌లో పారిస్‌లో జరిగిన 21వ కాప్ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ ఐఎస్‌ఏను ప్రారంభించారు. భారత్ ఈ నిధికి 1 మిలియన్ డాలర్లు ఇస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎస్‌ఏలో చేరిన 35వ దేశం
ఎప్పుడు : జూలై 21
ఎవరు : ఆస్ట్రేలియా
ఎందుకు : సోలార్ విద్యుత్ ఉత్పత్తికి నిధుల సమీకరణ కోసం
చైనా ఆర్మీ పది లక్షలకు కుదింపు
సైనిక బలగాలను భారీగా తగ్గించాలని చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 23 లక్షలు ఉన్న సైన్యాన్ని విడతల వారీగా 10 లక్షల లోపునకు తగ్గించాలని భావిస్తోంది. ఈ మేరకు చైనా ఆర్మీ అధికార పత్రిక పీఎల్‌ఏ డైలీ కథనం ప్రచురించింది. ఇంతవరకూ చైనా సంప్రదాయ సైనిక వ్యూహాల ప్రకారం సైన్యాన్ని భూతల పోరాటాలకు ఎక్కువగా వినియోగించేది. సంస్కరణల నేప థ్యంలో మిలటరీ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా ప్రణాళిక ప్రకారం నేవీ, స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్, మిస్సైల్ ఫోర్స్‌ను పెంచనుంది. ఆధునిక పరిజ్ఞానం, యుద్ధ తంత్రాల అమలు, కీలక లక్ష్యాల దిశగా మార్పులు ఉండబోతున్నాయని ఆ కథనం పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పీఎల్‌ఏ సైన్యం పది లక్షలకు కుదింపు
ఎప్పుడు : జూలై 12
ఎవరు : చైనా
ఎందుకు : ప్రత్యామ్నాయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో భాగంగా
అమెరికా రక్షణ వ్యయాల బిల్లులో 3 సవరణలు
పాకిస్తాన్‌కు సైనిక సాయం విషయంలో కఠినవైఖరి అవలంబించాలని అమెరికా చట్టసభ నిర్ణయించింది. ఆ మేరకు రక్షణ వ్యయాల బిల్లులో మూడు సవరణల్ని ప్రతినిధుల సభ ఆమోదించింది. ఉగ్రవాదంపై పాక్ పోరు సంతృప్తికరంగా ఉంటేనే నిధులు మంజూరు చేయాలని తాజా సవరణల్లో స్పష్టం చేశారు. 651 బిలియన్ డాలర్ల జాతీయ భద్రతా అధికార చట్టం (ఎన్‌డీఏఏ)- 2018 ఆమోదం సందర్భంగా ఈ సవరణల్ని ప్రతిపాదించారు. ఈ బిల్లును జూలై 15న ప్రతినిధుల సభ 344-81 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఆ దేశ రక్షణ మంత్రి ధ్రువీకరణ అనంతరం ఎన్‌డీఏఏ యాక్ట్ 2017 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
తాజా సవరణల ప్రకారం ఉత్తర వజిరిస్థాన్‌లోని హక్కాని నెట్‌వర్క్‌పై పాక్ సైన్యం పోరాటం కొనసాగించకపోతే అమెరికా నుంచి వచ్చే 400 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 2,600 కోట్లు) సాయం నిలిపివేస్తారు. పాకిస్తాన్- అఫ్గాన్ సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల కదలికల నియంత్రణకు పాక్ కృషిచేయాలి. అక్టోబర్ 1, 2017- డిసెంబర్ 31, 2018 మధ్య కాలానికి ఈ సాయం వర్తిస్తుంది.
ఈ బిల్లు ద్వారా భారత్ - అమెరికాల మధ్య రక్షణ రంగ సంబంధాలు కూడా బలపడనున్నాయి. భారత్‌తో రక్షణ సంబంధాలు బలోపేతం కోసం భారత-అమెరికన్ కాంగ్రెస్ నేత అమీ బెరా ప్రతిపాదించిన సవరణను ప్రతినిధుల సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ సవరణను అమెరికా రక్షణ శాఖ మంత్రి ధ్రువీకరించాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రక్షణ వ్యయాల బిల్లులో సవరణలు
ఎప్పుడు : జూలై 15
ఎవరు : అమెరికా
ఎందుకు : పాక్‌కు సైనిక సాయం, భారత్ - అమెరికా రక్షణ బంధం బలోపేతానికి
చెన్నైలో అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్
‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్ట్ - 2017’ చెన్నైలో జరగనుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ జూలై 15న తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 13 నుంచి 16 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. వివిధ దేశాల నుంచి దాదాపు 10 వేల మంది శాస్త్రవేత్తలు ఈ సైన్స్ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్
ఎప్పుడు : అక్టోబర్ 13-16, 2017
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఖతార్‌తో అమెరికా ఉగ్ర వ్యతిరేక ఒప్పందం
ఖతార్‌తో అమెరికా జూలై 11న ఉగ్రవాద వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకుంది. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తోందని ఆరోపిస్తూ నాలుగు అరబ్ దేశాలు ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని నివారించేందుకు అమెరికా తాజా ఒప్పందం కుదుర్చుకుంది.
మానవ అక్రమ రవాణాలో ముందున్న చైనా
ప్రపంచంలో అత్యధికంగా మానవుల అక్రమ రవాణా చైనాలో జరుగుతోందని అమెరికా పేర్కొంది. ఈ విషయంలో రష్యా, సిరియా, ఇరాన్‌లను చైనా మించిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ ఒక నివేదికలో జూలై 10న వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 2.10 కోట్ల మంది అక్రమ రవాణా అయ్యారని అంతర్జాతీయ కార్మిక కార్యాలయం తెలిపింది.
హాంబర్గ్‌లో 12వ జీ-20 సదస్సు
ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, స్వేచ్ఛా వాణిజ్య విస్తరణే లక్ష్యంగా జర్మనీలోని హాంబర్గ్‌లో జూలై 7, 8న జీ-20 దేశాల సదస్సు జరిగింది. మొత్తం 19 దేశాల అధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని, అదే సమయంలో ఉగ్రసాయానికి చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జీ-20 సదస్సు తీర్మానించింది.
జూలై 7న జీ-20 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ.. ప్రపంచంలో ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలన్నింటినీ అంతమొందించాలని నిర్ణయించాయి. ఉగ్రవాదుల్ని చట్టం ముందు నిలబెట్టాలని.. అందుకోసం భద్రత, ప్రయాణం, వలసలు, ఇంటర్‌పోల్ తదితర విభాగాల్లో ప్రస్తుతమున్న అంతర్జాతీయ సమాచార వ్యవస్థను మెరుగుపర్చాలని తెలిపాయి.
పారిస్ ఒప్పందంపై తీర్మానం
గ్లోబల్ వార్మింగ్‌పై పోరుకు కట్టుబడి ఉన్నామని జీ20 సదస్సులో భారత్ సహా 18 సభ్య దేశాలు స్పష్టం చేశాయి. సదస్సు ముగింపు సందర్భంగా జూలై 9న అధికారిక ప్రకటనలో ‘పారిస్ వాతావరణ ఒప్పందం అమలులో ఎలాంటి మార్పు ఉండదని, అమెరికా మినహా అన్ని దేశాలు సంపూర్ణ మద్దతు తెలిపాయ’ని చెప్పాయి. పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా ఈ సదస్సులో ఒంటరైంది.
ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు
ప్రధాని మోదీ ప్రసంగం
జీ-20 సమావేశాల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. జీ-20 దేశాలు ఉగ్రవాదుల జాబితాను ఇచ్చిపుచ్చుకోవటం, ఉగ్రవాదులను న్యాయపరమైన విచారణకోసం సభ్యదేశాలకు అప్పగించటం, వారికి అందే నిధులు, ఆయుధాల సరఫరాపై ప్రత్యేక దృష్టిపెట్టి కఠినంగా వ్యవహరించటంలాంటి 11 సూత్రాల కార్యాచరణను సదస్సులో మోదీ సూచించారు. విస్ఫోటక కార్యాచరణ దళం (ఈఏటీఎఫ్) ఏర్పాటు చేసి ఉగ్రవాదులకు ఆయుధాలు చేరకుండా కట్టడి చేయవచ్చని ప్రధాని వెల్లడించారు. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాల ప్రతినిధులకు జీ-20లో ప్రవేశాన్ని నిషేధించాలన్నారు.
పర్యావరణ మార్పులు, పారిస్ ఒప్పందం విషయంలో జీ-20 దేశాలన్నీ సంపూర్ణ సహకారంతో ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు.
జీ-20 గురించి..
ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సహకారం కోసం అంతర్జాతీయ వేదికగా జరిగే ముఖ్యమైన సదస్సుల్లో జీ-20 ఒకటి. 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి జీ-20 కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య విధానం సహా పలు కీలకాంశాలపై సభ్య దేశాల అధినేతలు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు చర్చలు జరుపుతారు.
జీ-20 సమావేశాలు
ఏమిటి : జీ-20 సమావేశం
ఎప్పుడు : జూలై 7-8
ఎక్కడ : హాంబర్గ్, జర్మనీ
ఎందుకు : ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, స్వేచ్ఛా వాణిజ్య విస్తరణే లక్ష్యంగా
అణ్వాయుధ నిషేధ ఒప్పందానికి ఆమోదం
అణ్వాయుధాల నిషేధం కోసం తొలి చట్టబద్ధ అంతర్జాతీయ ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. జూలై 8న సంబంధిత తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఒప్పందానికి అనుకూలంగా 122 దేశాలు ఓటేయగా, నెదర్లాండ్‌స వ్యతిరేకంగా ఓటేసింది. సింగపూర్ గైర్హాజరైంది. అణ్వాయుధాల అభివృద్ధి, పరీక్షలు, తయారీ, సేకరణ, నిల్వ, వాడకం వంటి అన్ని కార్యక్రమాలను ఒప్పందం నిషేధించింది. ఈ ఆయుధాల పేరుతో బెదిరింపులకు కూడా పాల్పడకూడదని స్పష్టం చేసింది.
అణుశక్తి దేశాలైన భారత్, అమెరికా, బ్రిటన్, రష్యా, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్ తదితరాలు ఈ ఒప్పందం కోసం ఈ ఏడాది మార్చిలో జరిగిన చర్చలను బహిష్కరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అణ్వాయుధాల నిషేధ ఒప్పందానికి ఆమోదం
ఎప్పుడు : జూలై 8
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : అణ్వాయుధాలపై నిషేధానికి
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం: ఎస్‌ఓహెచ్‌ఆర్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ మరణించినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ జూలై 11న వెల్లడించింది. సిరియాలోని డైర్ ఎజ్జార్‌లో ఉన్న ఐసిస్ కీలక నేతలు బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారని.. జూలై 11న ఈ విషయం తెలిసిందని పేర్కొంది. అయితే బాగ్దాదీ ఎక్కడ, ఎలా మరణించాడనేది తెలియదని సంస్థ డెరైక్టర్ రామి అబ్దుల్ రహ్మాన్ వివరించారు.
బాగ్దాదీ మరణంపై ఐసిస్ స్పందించలేదు. ఇరాక్, సిరియాలలో ఐసిస్‌తో పోరాడుతున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం
ఎప్పుడు : జూలై 11
ఎవరు : సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్
ఎక్కడ : సిరియాలో
గ్రీన్ కార్డులకు 12 ఏళ్ల నిరీక్షణ
అమెరికాలో నైపుణ్య ఉద్యోగులుగా శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే భారతీయుల ముందు 12 ఏళ్ల సుదీర్ఘ వెయిటింగ్ జాబితా ఉంది. అయితే ఏటా ఈ కార్డులు పొందుతున్న వారిలో భారతీయులే ఎక్కువ ఉన్నారు. 2015లో అమెరికాలో 36,318 మంది భారతీయులు తమ హోదాను శాశ్వత నివాసం హోదాకు సర్దుబాటు చేసుకున్నారు. కొత్తగా ప్రవేశించిన మరో 27,978 మంది గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్ధ శాశ్వత నివాసాన్ని పొందారు. ఈ మేరకు ప్యూ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఒక ఉద్యోగ సంబంధ విభాగంలో భారతీయుల ముందు ప్రస్తుతం 12 ఏళ్ల జాబితా ఉందని, ప్రభుత్వం 2005 మేలో వచ్చిన దరఖాస్తులను ఇంకా పరిశీలిస్తోందని పేర్కొంది. 2015లో 5,42,315 మంది తమ నివాస హోదాను శాశ్వత నివాస హోదాకు మార్చుకున్నారని వెల్లడించింది. గ్రీన్‌కార్డు దారులు ఐదేళ్లు అమెరికాలో ఉంటే ఆ దేశ పౌర సత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రీన్ కార్డు కోసం 12 ఏళ్ల నిరీక్షణ
ఎప్పుడు : జూలై 11
ఎవరు : ప్యూ రీసెర్చ్ సంస్థ
ఎక్కడ : అమెరికాలో
ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో గుర్తింపు
జపాన్‌లోని ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంత హోదా దక్కింది. ఇక్కడి ద్వీప దేవతను సందర్శించుకునేందుకు ఏడాదికి 200 మందిని మాత్రమే అనుమతిస్తారు.అయితే మహిళలకు ప్రవేశం లేదు. సముద్రం ద్వారా ఇక్కడికి చేరుకోవడం ప్రమాదమనే కారణంతోనే స్త్రీలను ఇక్కడికి అనుమతించడం లేదని తెలుస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో వెయ్యికి పైగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశాలున్నాయి. స్మారక స్థలాలు, ప్రదేశాలు, నగరాలు, నిర్మాణాలు ఈ జాబితాలో ఉన్నాయి.
2019 ప్రపంచ పుస్తక రాజధానిగా షార్జా
2019 ప్రపంచ పుస్తక రాజధానిగా యూఏఈలోని షార్జా నగరం ఎంపికైంది. ఈ మేరకు జూన్ 29న యునెస్కో ఓ ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్(జీసీసీ)లో ఈ గుర్తింపు పొందిన తొలి నగరంగా షార్జా నిలిచింది.
2001 నుంచి యునెస్కో ఏటా ఓ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా గుర్తిస్తుంది. 2001లో స్పెయిన్‌లోని మేడ్రిడ్ నగరానికి తొలి గుర్తింపు లభించింది. 2017కి గాను రిపబ్లిక్ ఆఫ్ గునియాలోని కొనార్కీ నగరం, 2018కి గాను గ్రీస్‌లోని ఏథెన్స్ నగరం ఈ గుర్తింపు పొందాయి.
2003లో భారత్‌లోని న్యూఢిల్లీకి ప్రపంచ పుస్తక రాజధానిగా గుర్తింపు లభించింది. పుస్తక పఠనం, సాహిత్య అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా యునెస్కో ఈ నగరాలను ఎంపిక చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019 ప్రపంచ పుస్తక రాజధానిగా షార్జా ఎంపిక
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : యునెస్కో
ఎందుకు : పుస్తక పఠనం, సాహిత్య అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా
టీఏజేకేపై నిషేధం విధించిన పాకిస్తాన్
ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా(జేయూడీ) ఫ్రంట్‌లో భాగమైన తెహ్రిక్-ఈ-ఆజాద్ జమ్మూ కశ్మీర్(టీఏజేకే)పై పాకిస్తాన్ నిషేధం విధించింది. ఉగ్రవాద నిర్మూలనకు ఇస్తున్న నిధులను నిలిపేస్తామంటూ అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడుల కారణంగా పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఫిబ్రవరి 5న కశ్మీర్ దినోత్సవం అంటూ.. స్వాతంత్య్రం కావాలంటూ ర్యాలీలు తీయడం లాంటి కార్యక్రమాలను జేయూడీ నిర్వహించింది. దీంతో సయీద్‌ను లాహోర్‌లో 90 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. గతంలోనూ సయీద్‌ను పాక్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెహ్రిక్-ఈ-ఆజాద్ జమ్మూ కశ్మీర్‌పై నిషేధం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : పాకిస్తాన్
డోకా లా కనుమ మాదంటూ మ్యాప్ విడుదల చేసిన చైనా
సిక్కిం సెక్టార్‌లో ఉండే ‘డోకా లా’ కనుమను తమ దేశంలో భాగంగా చూపుతూ జూలై 1న చైనా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది. భారత సైనికులు తమ భూభాగంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారని చైనా ఆరోపించినప్పుడు భారత సైనికులు వెళ్లింది ఈ కనుమ వద్దకే. కొన్నిరోజుల క్రితం భారత్, చైనా సైనికులు కలబడిందీ ఇక్కడే. డోకా లాను చైనా డాంగ్లాంగ్ అని పిలుస్తుంది. వాస్తవానికి ఈ ప్రాంతం భారత్, చైనా, భూటాన్.. మూడు దేశాల సరిహద్దులో ఉంటుంది. కానీ 2012 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఏకపక్షంగా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుని రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీనిని భారత సైనికులు అడ్డుకోవడంతో సమస్య మొదలైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనాలో మ్యాపులో డోకా లా కనుమ
ఎప్పుడు : జూలై 1
ఎవరు : చైనా
ఎక్కడ : సిక్కిం సెక్టార్‌లో
హాంకాంగ్‌లో చైనా పాలనకు 20 ఏళ్లు
బ్రిటిష్ పాలన నుంచి హాంకాంగ్ చైనా చేతుల్లోకి వెళ్లి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జూలై 1న హాంకాంగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఒక దేశం, రెండు వ్యవస్థలు విధానానికి హాంకాంగ్ ప్రజలు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.
హాంకాంగ్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను చైనా నిర్దేశిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ చాలాకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న అక్కడి ప్రజలు.. జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీనిపై జిన్‌పింగ్ మాట్లాడుతూ హాంకాంగ్ ప్రజలు ఇప్పుడున్నంత స్వేచ్ఛగా ఇంతకముందు ఎన్నడూ లేరన్నారు. ఆసియాకు ఆర్థిక కేంద్రంగా ఉన్న హాంకాంగ్ మరింత అభివృద్ధి చెందటంపై దృష్టి పెట్టాలని, ఆందోళనలు పురోగతని దెబ్బతీస్తాయని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హాంకాంగ్‌లో చైనా పాలనకు 20 ఏళ్లు
ఎప్పుడు : జూలై 1
ఎవరు : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్
ఎందుకు : బ్రిటిష్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం
ప్రపంచ మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు 80 ఏళ్లు
ప్రపంచంలోనే మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 999 జూలై 1తో 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో బ్రిటన్ పోలీసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీసులు, ఫైర్, అంబులెన్‌స, కోస్ట్‌గార్డ్ సిబ్బందులను అప్రమత్తం చేసి, వారి నుంచి సాయం పొందేందుకు బ్రిటన్‌లో ఇప్పటికీ ఈ నంబర్‌నే వినియోగిస్తున్నారు. ఈ హెల్ప్‌లైన్ సిబ్బంది 179 భాషలను అర్థం చేసుకుని, సహాయం అందించగలరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 999కు 80 ఏళ్లు
ఎప్పుడు : జూలై 1 నాటికి
ఎక్కడ : బ్రిటన్
జర్మనీలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత
స్వలింగ వివాహ పద్ధతికి జర్మన్ పార్లమెంటు జూన్ 30న ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా ‘లింగ భేదంతో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకునేందుకు వీలుగా చట్ట సవరణ చేసింది. ఈ చట్టం ప్రకారం 2001 నుంచి జర్మనీలో ఉంటున్న వారెవరైనా జంటగా మారితే వారు అన్ని రకాల వైవాహిక హక్కులను పొందుతారు.

- ఐఎంఎఫ్ సంస్కరణల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు, 2019లోగా కొత్త సంస్కరణల్ని రూపొందించాలి.
- మార్కెట్‌కు నష్టం కలిగించే సబ్సిడీలకు స్వస్తిచెప్పాలి. పారిశ్రామిక రంగంలో అధికోత్పత్తి సమస్యను అధిగమించేందుకు అంతర్జాతీయంగా సహకరించుకోవాలి.
- రక్షణ రంగంలో ఆయుధాల చట్టబద్ధ వ్యాపారానికి జీ20 సదస్సు అంగీకారం.
- వాణిజ్యం, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని, స్వేచ్ఛా వాణిజ్య విఫణికి కట్టుబడి ఉండాలని తీర్మానం.
ప్రధాని మోదీ ప్రసంగం
జీ-20 సమావేశాల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాజకీయ లక్ష్యాలను సాధించేందుకు కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. జీ-20 దేశాలు ఉగ్రవాదుల జాబితాను ఇచ్చిపుచ్చుకోవటం, ఉగ్రవాదులను న్యాయపరమైన విచారణకోసం సభ్యదేశాలకు అప్పగించటం, వారికి అందే నిధులు, ఆయుధాల సరఫరాపై ప్రత్యేక దృష్టిపెట్టి కఠినంగా వ్యవహరించటంలాంటి 11 సూత్రాల కార్యాచరణను సదస్సులో మోదీ సూచించారు. విస్ఫోటక కార్యాచరణ దళం (ఈఏటీఎఫ్) ఏర్పాటు చేసి ఉగ్రవాదులకు ఆయుధాలు చేరకుండా కట్టడి చేయవచ్చని ప్రధాని వెల్లడించారు. ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాల ప్రతినిధులకు జీ-20లో ప్రవేశాన్ని నిషేధించాలన్నారు.
పర్యావరణ మార్పులు, పారిస్ ఒప్పందం విషయంలో జీ-20 దేశాలన్నీ సంపూర్ణ సహకారంతో ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు.
జీ-20 గురించి..
ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సహకారం కోసం అంతర్జాతీయ వేదికగా జరిగే ముఖ్యమైన సదస్సుల్లో జీ-20 ఒకటి. 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి జీ-20 కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య విధానం సహా పలు కీలకాంశాలపై సభ్య దేశాల అధినేతలు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు చర్చలు జరుపుతారు.
- ఆసియన్ ఆర్థిక సంక్షోభం తర్వాత అంతర్జాతీయ ద్రవ్య స్థిరీకరణకు అవలంబించాల్సిన విధానాల రూపకల్పన కోసం 1999లో జీ-20ని ఏర్పాటు చేశారు.
- అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో 2008లో జీ-20 తొలి సమావేశం జరిగింది.
- ప్రపంచ జీడీపీలో 80 శాతం జీ-20 దేశాలు కలిగి ఉంటాయి.
- మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం జీ-20 దేశాల ద్వారానే జరుగుతుంది.
- ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు జీ-20 దేశాల్లో ఉన్నారు.
ఈయూ | భారత్ | చైనా |
జపాన్ | కెనడా | దక్షిణ కొరియా |
యూకే | సౌదీ అరేబియా | అమెరికా |
ఇండోనేషియా | మెక్సికో | బ్రెజిల్ |
ఫ్రాన్స్ | దక్షిణాఫ్రికా | ఇటలీ |
ఆస్ట్రేలియా | రష్యా | అర్జెంటీనా |
టర్కీ | జర్మనీ |
|
- 2008 - వాషింగ్టన్ డీసీ, అమెరికా
- 2009 - లండన్, యూకే
- 2009 - పిట్స్‌బర్గ్ , అమెరికా
- 2010 - టొరంటో, కెనడా
- 2010 - సియోల్, దక్షిణ కొరియా
- 2011 - కేన్స్, ఫ్రాన్స్
- 2012 - లాస్ కాబోస్, మెక్సికో
- 2013 - సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా
- 2014 - బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
- 2015 - అంటల్యా, టర్కీ
- 2016 - హాంగ్జౌ, చైనా
- 2017 - హాంబర్గ్, జర్మనీ
ఏమిటి : జీ-20 సమావేశం
ఎప్పుడు : జూలై 7-8
ఎక్కడ : హాంబర్గ్, జర్మనీ
ఎందుకు : ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, స్వేచ్ఛా వాణిజ్య విస్తరణే లక్ష్యంగా
అణ్వాయుధ నిషేధ ఒప్పందానికి ఆమోదం
అణ్వాయుధాల నిషేధం కోసం తొలి చట్టబద్ధ అంతర్జాతీయ ఒప్పందానికి ఐక్యరాజ్య సమితి భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. జూలై 8న సంబంధిత తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఒప్పందానికి అనుకూలంగా 122 దేశాలు ఓటేయగా, నెదర్లాండ్‌స వ్యతిరేకంగా ఓటేసింది. సింగపూర్ గైర్హాజరైంది. అణ్వాయుధాల అభివృద్ధి, పరీక్షలు, తయారీ, సేకరణ, నిల్వ, వాడకం వంటి అన్ని కార్యక్రమాలను ఒప్పందం నిషేధించింది. ఈ ఆయుధాల పేరుతో బెదిరింపులకు కూడా పాల్పడకూడదని స్పష్టం చేసింది.
అణుశక్తి దేశాలైన భారత్, అమెరికా, బ్రిటన్, రష్యా, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్ తదితరాలు ఈ ఒప్పందం కోసం ఈ ఏడాది మార్చిలో జరిగిన చర్చలను బహిష్కరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అణ్వాయుధాల నిషేధ ఒప్పందానికి ఆమోదం
ఎప్పుడు : జూలై 8
ఎవరు : ఐక్యరాజ్య సమితి
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : అణ్వాయుధాలపై నిషేధానికి
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం: ఎస్‌ఓహెచ్‌ఆర్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీ మరణించినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ జూలై 11న వెల్లడించింది. సిరియాలోని డైర్ ఎజ్జార్‌లో ఉన్న ఐసిస్ కీలక నేతలు బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారని.. జూలై 11న ఈ విషయం తెలిసిందని పేర్కొంది. అయితే బాగ్దాదీ ఎక్కడ, ఎలా మరణించాడనేది తెలియదని సంస్థ డెరైక్టర్ రామి అబ్దుల్ రహ్మాన్ వివరించారు.
బాగ్దాదీ మరణంపై ఐసిస్ స్పందించలేదు. ఇరాక్, సిరియాలలో ఐసిస్‌తో పోరాడుతున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం
ఎప్పుడు : జూలై 11
ఎవరు : సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్
ఎక్కడ : సిరియాలో
గ్రీన్ కార్డులకు 12 ఏళ్ల నిరీక్షణ
అమెరికాలో నైపుణ్య ఉద్యోగులుగా శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే భారతీయుల ముందు 12 ఏళ్ల సుదీర్ఘ వెయిటింగ్ జాబితా ఉంది. అయితే ఏటా ఈ కార్డులు పొందుతున్న వారిలో భారతీయులే ఎక్కువ ఉన్నారు. 2015లో అమెరికాలో 36,318 మంది భారతీయులు తమ హోదాను శాశ్వత నివాసం హోదాకు సర్దుబాటు చేసుకున్నారు. కొత్తగా ప్రవేశించిన మరో 27,978 మంది గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్ధ శాశ్వత నివాసాన్ని పొందారు. ఈ మేరకు ప్యూ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఒక ఉద్యోగ సంబంధ విభాగంలో భారతీయుల ముందు ప్రస్తుతం 12 ఏళ్ల జాబితా ఉందని, ప్రభుత్వం 2005 మేలో వచ్చిన దరఖాస్తులను ఇంకా పరిశీలిస్తోందని పేర్కొంది. 2015లో 5,42,315 మంది తమ నివాస హోదాను శాశ్వత నివాస హోదాకు మార్చుకున్నారని వెల్లడించింది. గ్రీన్‌కార్డు దారులు ఐదేళ్లు అమెరికాలో ఉంటే ఆ దేశ పౌర సత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రీన్ కార్డు కోసం 12 ఏళ్ల నిరీక్షణ
ఎప్పుడు : జూలై 11
ఎవరు : ప్యూ రీసెర్చ్ సంస్థ
ఎక్కడ : అమెరికాలో
ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో గుర్తింపు
జపాన్‌లోని ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంత హోదా దక్కింది. ఇక్కడి ద్వీప దేవతను సందర్శించుకునేందుకు ఏడాదికి 200 మందిని మాత్రమే అనుమతిస్తారు.అయితే మహిళలకు ప్రవేశం లేదు. సముద్రం ద్వారా ఇక్కడికి చేరుకోవడం ప్రమాదమనే కారణంతోనే స్త్రీలను ఇక్కడికి అనుమతించడం లేదని తెలుస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో వెయ్యికి పైగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశాలున్నాయి. స్మారక స్థలాలు, ప్రదేశాలు, నగరాలు, నిర్మాణాలు ఈ జాబితాలో ఉన్నాయి.
2019 ప్రపంచ పుస్తక రాజధానిగా షార్జా
2019 ప్రపంచ పుస్తక రాజధానిగా యూఏఈలోని షార్జా నగరం ఎంపికైంది. ఈ మేరకు జూన్ 29న యునెస్కో ఓ ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్(జీసీసీ)లో ఈ గుర్తింపు పొందిన తొలి నగరంగా షార్జా నిలిచింది.
2001 నుంచి యునెస్కో ఏటా ఓ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా గుర్తిస్తుంది. 2001లో స్పెయిన్‌లోని మేడ్రిడ్ నగరానికి తొలి గుర్తింపు లభించింది. 2017కి గాను రిపబ్లిక్ ఆఫ్ గునియాలోని కొనార్కీ నగరం, 2018కి గాను గ్రీస్‌లోని ఏథెన్స్ నగరం ఈ గుర్తింపు పొందాయి.
2003లో భారత్‌లోని న్యూఢిల్లీకి ప్రపంచ పుస్తక రాజధానిగా గుర్తింపు లభించింది. పుస్తక పఠనం, సాహిత్య అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా యునెస్కో ఈ నగరాలను ఎంపిక చేస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019 ప్రపంచ పుస్తక రాజధానిగా షార్జా ఎంపిక
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : యునెస్కో
ఎందుకు : పుస్తక పఠనం, సాహిత్య అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల ఆధారంగా
టీఏజేకేపై నిషేధం విధించిన పాకిస్తాన్
ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా(జేయూడీ) ఫ్రంట్‌లో భాగమైన తెహ్రిక్-ఈ-ఆజాద్ జమ్మూ కశ్మీర్(టీఏజేకే)పై పాకిస్తాన్ నిషేధం విధించింది. ఉగ్రవాద నిర్మూలనకు ఇస్తున్న నిధులను నిలిపేస్తామంటూ అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడుల కారణంగా పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఫిబ్రవరి 5న కశ్మీర్ దినోత్సవం అంటూ.. స్వాతంత్య్రం కావాలంటూ ర్యాలీలు తీయడం లాంటి కార్యక్రమాలను జేయూడీ నిర్వహించింది. దీంతో సయీద్‌ను లాహోర్‌లో 90 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. గతంలోనూ సయీద్‌ను పాక్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెహ్రిక్-ఈ-ఆజాద్ జమ్మూ కశ్మీర్‌పై నిషేధం
ఎప్పుడు : జూలై 1
ఎవరు : పాకిస్తాన్
డోకా లా కనుమ మాదంటూ మ్యాప్ విడుదల చేసిన చైనా
సిక్కిం సెక్టార్‌లో ఉండే ‘డోకా లా’ కనుమను తమ దేశంలో భాగంగా చూపుతూ జూలై 1న చైనా ఓ మ్యాప్‌ను విడుదల చేసింది. భారత సైనికులు తమ భూభాగంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారని చైనా ఆరోపించినప్పుడు భారత సైనికులు వెళ్లింది ఈ కనుమ వద్దకే. కొన్నిరోజుల క్రితం భారత్, చైనా సైనికులు కలబడిందీ ఇక్కడే. డోకా లాను చైనా డాంగ్లాంగ్ అని పిలుస్తుంది. వాస్తవానికి ఈ ప్రాంతం భారత్, చైనా, భూటాన్.. మూడు దేశాల సరిహద్దులో ఉంటుంది. కానీ 2012 నాటి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా ఏకపక్షంగా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుని రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీనిని భారత సైనికులు అడ్డుకోవడంతో సమస్య మొదలైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనాలో మ్యాపులో డోకా లా కనుమ
ఎప్పుడు : జూలై 1
ఎవరు : చైనా
ఎక్కడ : సిక్కిం సెక్టార్‌లో
హాంకాంగ్‌లో చైనా పాలనకు 20 ఏళ్లు
బ్రిటిష్ పాలన నుంచి హాంకాంగ్ చైనా చేతుల్లోకి వెళ్లి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ జూలై 1న హాంకాంగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఒక దేశం, రెండు వ్యవస్థలు విధానానికి హాంకాంగ్ ప్రజలు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.
హాంకాంగ్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులను చైనా నిర్దేశిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ చాలాకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న అక్కడి ప్రజలు.. జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీనిపై జిన్‌పింగ్ మాట్లాడుతూ హాంకాంగ్ ప్రజలు ఇప్పుడున్నంత స్వేచ్ఛగా ఇంతకముందు ఎన్నడూ లేరన్నారు. ఆసియాకు ఆర్థిక కేంద్రంగా ఉన్న హాంకాంగ్ మరింత అభివృద్ధి చెందటంపై దృష్టి పెట్టాలని, ఆందోళనలు పురోగతని దెబ్బతీస్తాయని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హాంకాంగ్‌లో చైనా పాలనకు 20 ఏళ్లు
ఎప్పుడు : జూలై 1
ఎవరు : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్
ఎందుకు : బ్రిటిష్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం
ప్రపంచ మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు 80 ఏళ్లు
ప్రపంచంలోనే మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 999 జూలై 1తో 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో బ్రిటన్ పోలీసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీసులు, ఫైర్, అంబులెన్‌స, కోస్ట్‌గార్డ్ సిబ్బందులను అప్రమత్తం చేసి, వారి నుంచి సాయం పొందేందుకు బ్రిటన్‌లో ఇప్పటికీ ఈ నంబర్‌నే వినియోగిస్తున్నారు. ఈ హెల్ప్‌లైన్ సిబ్బంది 179 భాషలను అర్థం చేసుకుని, సహాయం అందించగలరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ మొదటి ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 999కు 80 ఏళ్లు
ఎప్పుడు : జూలై 1 నాటికి
ఎక్కడ : బ్రిటన్
జర్మనీలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత
స్వలింగ వివాహ పద్ధతికి జర్మన్ పార్లమెంటు జూన్ 30న ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా ‘లింగ భేదంతో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకునేందుకు వీలుగా చట్ట సవరణ చేసింది. ఈ చట్టం ప్రకారం 2001 నుంచి జర్మనీలో ఉంటున్న వారెవరైనా జంటగా మారితే వారు అన్ని రకాల వైవాహిక హక్కులను పొందుతారు.
Published date : 22 Jul 2017 04:23PM