Skip to main content

Italy's PM: ఇటలీ ప్రధాని మారియో రాజీనామా

Italian Prime Minister Mario Draghi resigns
Italian Prime Minister Mario Draghi resigns

ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి పదవి నుంచి వైదొలిగారు. జూలై 21న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ్య పక్షం 5–స్టార్స్‌ మరో రెండు పార్టీలు బహిష్కరించాయి. దీంతో ద్రాఘి తన రాజీనామా లేఖను అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాకు అందజేశారు. ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు 5–స్టార్స్‌ పార్టీ ప్రకటించడంతో గత వారమే ఆయన రాజీనామా చేసినా అధ్యక్షుడు ఆమోదించలేదు. తాజా పరిణామాలతో మరో సారి అందజేసిన రాజీనామా లేఖను మట్టరెల్లా ఆమోదించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగాలని ద్రాఘిని కోరారు. దీంతో, అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిగేందుకు అవకాశముందని భావిస్తున్నారు. 

also read: Right to an Abortion: గర్భస్రావ హక్కును కాపాడుతూ బైడెన్‌ ఉత్తర్వు
 

 Download Current Affairs PDFs Here

 Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

 

Published date : 22 Jul 2022 06:08PM

Photo Stories