Drugs: రూ.600 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది అరెస్ట్.. ఎక్కడంటే..
Sakshi Education
గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరంలో భారీస్థాయి మాదకద్రవ్యాల రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఛేదించింది.
భారత్‌లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రను భగ్నం చేసింది.
ఎన్‌సీబీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఏప్రిల్ 27వ తేదీ రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోరుబందర్ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్ చేసి, పాకిస్థాన్‌కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఆపరేషన్‌లో భాగంగా పాక్ నౌకని నిలువరించేందుకు కోస్ట్‌గార్డ్ నౌకలు, విమానాలను మోహరించింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కీలక నౌకల్లో కోస్ట్ గార్డ్ షిప్ రాజ్‌రతన్‌లో ఎన్సీబీ,ఏటీఎస్ అధికారులు దాడులు చేశారు.
Published date : 29 Apr 2024 04:29PM