Iran: 'స్పేస్‌టగ్'ను ప్రయోగించిన ఇరాన్
Sakshi Education
వివిధ కక్ష్యల మధ్య ఉపగ్రహాలను బదిలీ చేసే సామర్థ్యమున్న ఒక స్పేస్‌టగ్‌ను ఇరాన్ ప్రయోగించినట్లు ఆ దేశ అధికారిక మీడియా పేర్కొంది.'సమన్' అనే ఈ ప్రయోగాత్మక వ్యోమనౌకను తమ అంతరిక్ష పరిశోధన కేంద్రం నిర్మించిందని, దీన్ని విజయవంతంగా ప్రయోగించామని తెలిపింది. ఈ టగ్‌ను భవిష్యత్‌లో పరీక్షిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తంచేసింది. ఇరాన్ చాలా కాలంగా అంతరిక్ష కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శాంతియుత అవసరాలకే దీన్ని చేపడుతున్నామని చెబుతోంది. అయితే బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని ఇరాన్ మరింత ముందుకు తీసుకెళుతుందేమోనని అమెరికా ఆందోళన చెందుతోంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 14 Oct 2022 03:41PM