Climate Change Performance Index: పర్యావరణ పరిరక్షణ సూచీలో భారత్‌కు ఎనిమిదో స్థానం
గతంలో కంటే మెరుగైన పనితీరుతో తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకుంది. పర్యావరణ మార్పు ఆచరణ సూచీ(సీసీపీఐ)–2023లో 8వ ర్యాంకును పొందింది. గతంలో కంటే రెండు స్థానాల మేరకు ఉన్నతి సాధించడం విశేషం. ఈ సూచీని ప్రతియేటా జర్మనీకి చెందిన జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్సిటిట్యూట్, క్లైమేట్ యాక్షన్ నెట్‌వర్క్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేస్తాయి.
ఈ సూచీ ర్యాంకులను నాలుగు అంశాల వారీగా విడుదల చేస్తారు. హరిత ఉద్గారాల్లో భారత్ 9వ స్థానంలో, పునరుత్పాదక ఇంధన శక్తిలో 24వ స్థానంలో, ఇంధన వినియోగంలో 9వ స్థానంలో, క్లైమేట్ పాలసీలో 8వ స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే భారత్ ఈ సూచీలోని 63 దేశాల్లో 8వ స్థానంలో ఉంది. ఈ సూచీలో మొదటి మూడు స్థానాల్లో ఏ దేశం కూడా చోటు సంపాదించుకోలేదు. నాలుగో ర్యాంకులో డెన్మార్క్, ఐదో స్థానంలో స్వీడన్ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య కారక దేశమైన చైనా ఈ ఏడాది 13 స్థానాలను కోల్పోయి.. 51వ ర్యాంకులో నిలిచింది. కొత్తగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించడంతో చాలా తక్కువ స్థాయి రేటింగ్‌ను పర్యావరణ సంస్థలు ఇచ్చాయి. అమెరికా మూడు స్థానాలను మెరుగుపరచుకుని 52వ ర్యాంకు పొందింది. ఇరాన్ (63), సౌదీ అరేబియా(62), కజకిస్థాన్(61) ర్యాంకులతో చివరి స్థానంలో నిలిచాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP