INS Sumitra: ఇరాన్ నౌక హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్‌ఎస్ సుమిత్రా’
అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 700 నాటికల్ మైల్స్ దూరంలో ఇరాన్ దేశానికి చెందిన ఫిషింగ్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
సమాచారం తెలిసిన వెంటనే ఇండియన్ నేవి అప్రమత్తమై ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇరాన్ ఫిషింగ్ నౌకను సోమాలియా హైజార్ల నుంచి ‘ఐఎన్‌ఎస్ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. కాగా సోమాలియా సముద్రపు దొంగల చేత హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన ఎంవీ ఇమాన్ మత్స్యకార నౌకలో 17 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది.
Indian Navy warship INS Sumitra is rescuing fishermen hijacked by Somali pirates 700 nautical miles west of Kochi in the Arabian Sea. The Iranian fishing vessel MV Iman with around 17 crew members was hijacked by Somali pirates: Indian Defence officials pic.twitter.com/EOEs7zgQHn
— ANI (@ANI) January 29, 2024