World Population Review: జనాభాలో చైనాను అధిగమించిన భారత్
Sakshi Education
జనాభాలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్టు వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకటించింది.
2022 చివరి నాటికి భారత జనాభా 141.7 కోట్లని, 2023 జనవరి 18 నాటికి ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకున్నట్టు తెలిపింది. మాక్రోట్రెండ్స్ అనే సంస్థ కూడా మన దేశ జనాభా 142.8 కోట్లకు చేరిందని అంచనా వేసింది. గత 60 ఏళ్ల తొలిసారిగా చైనా జనాభా తగ్గినట్టు తాజా నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనా జనాభా 141.2 కోట్లని ఆ దేశం ప్రకటించింది.
చైనా జనాభాను భారత్.. 2023 చివరి నాటికి అధిగమిస్తుందని ఐక్యరాజ్యసమితి గతంలో అంచనా వేసింది. కాని ఈ రికార్డును భారత్ ఇప్పటికే అధిగమించినట్టు వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెల్లడించింది.
Also read: Buzz Aldrin: చంద్రునిపై కాలుపెట్టిన ఆ్రల్డిన్‌కు.. 93వ ఏట నాలుగో పెళ్లి
Published date : 23 Jan 2023 03:40PM