Skip to main content

Buzz Aldrin: చంద్రునిపై కాలుపెట్టిన ఆ్రల్డిన్‌కు.. 93వ ఏట నాలుగో పెళ్లి

చంద్రునిపై కాలు పెట్టిన రెండో వ్యక్తిగా చరిత్రకెక్కిన అమెరికా వ్యోమగామి బజ్‌ ఆల్డ్రిన్‌ లేటు వయసులో జ‌న‌వ‌రి 20వ తేదీ 93వ పుట్టినరోజు నాడే తన చిరకాల ప్రేయసి అయిన 63 ఏళ్ల డాక్టర్‌ అంకా ఫార్‌ను పెళ్లాడారు.

లాస్‌ ఏంజెలెస్‌లో నిరాడంబరంగా తామిద్దరం వైవాహిక బంధంతో ఒక్కటయ్యామంటూ ట్వీట్‌ చేశారు. రెండు పెళ్లి ఫొటోలను షేర్‌ చేశారు. వాటిలో ఆయన చూడచక్కని సూట్‌ ధరించి మురిసిపోతూ కన్పిస్తున్నారు. దానిపై మెడల్, ఎయిర్‌ఫోర్స్‌ బ్యాడ్జ్‌ కూడా ధరించారు. గతంలో మూడుసార్లు విడాకులు తీసుకున్న ఆ్రల్డిన్‌కు ఇది నాలుగో పెళ్లి. ఆయనకు ముగ్గురు పిల్లలు, ఒక మనవడు, ముగ్గురు ముని మనవలతో పాటు ఒక ముని ముని మనవరాలు కూడా ఉన్నారు.
నాసా అపోల్‌–11 మిషన్లో భాగస్వాములైన ముగ్గురు వ్యోమగాముల్లో 1969 జూలై 20న నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ చంద్రునిపై కాలుపెట్టి చరిత్ర సృష్టించడం తెలిసిందే. కాసేపటికి ఆ్రల్డిన్, ఆయన తర్వాత మైఖేల్‌ కొలిన్స్‌ చంద్రునిపై దిగారు. వారిలో ఇప్పటికీ జీవించి ఉన్నది కూడా ఆ్రల్డినే. ఆయన 1971లో నాసా నుంచి రిటైరయ్యారు. తర్వాత షేర్‌స్పేస్‌ వెంచర్స్‌ స్థాపించారు. అంకా అందులో 2019 నుంచి పని చేస్తున్నారు.

Miss Universe 2022: మిస్‌ యూనివర్స్‌గా ఆర్‌బోనీ గాబ్రియల్‌

Published date : 23 Jan 2023 10:54AM

Photo Stories