FTA: అమల్లోకి భారత్–ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం
Sakshi Education
భారత్, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన మధ్యంతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) డిసెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఆస్ట్రేలియా విపణిలో జౌళి, తోళ్లు, వంటి వేలాది దేశీయ ఉత్పత్తులు సుంకాల రహితంగా లభించనున్నాయి. ఈ ఒప్పందంతో వచ్చే అయిదేళ్లలో ధ్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెట్టింపై 40–50 బిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న ది ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్‌పై ఇరు దేశాలు సంతకాలు చేసిన విషయం తెలిసిందే.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 06 Jan 2023 05:20PM