Skip to main content

India: రష్యాపై ఐరాస తీర్మానం: ఓటింగ్‌కు భారత్‌ దూరం

ఉక్రెయిన్‌ యుద్ధంలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు రష్యా బాధ్యత వహించాలని, కీవ్‌కు జరిగిన నష్టాలకు తగిన పరిహారం చెల్లించాలంటూ.. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
India abstains from UN vote condemning Russia

దీనికి సంబంధించిన ఓటింగ్‌కు భారత్‌గైర్హాజరైంది. ఈ తీర్మానాన్ని ఉక్రెయిన్‌ ప్రవేశపెట్టగా.. 94 దేశాలు అనుకూలంగా.. 14 దేశాలు వ్యతిరేకంగా ఓటువేశాయి. తీర్మానం ఓటింగ్‌కు 73 దేశాలు గైర్హాజరయ్యాయి. ఓటింగ్‌కు దూరంగా ఉన్న దేశాల్లో భారత్, భూటాన్‌, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, నేపాల్, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఉన్నాయి. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటింగ్‌ చేసిన దేశాల్లో బెలారస్, చైనా, క్యూబా, ఉత్తరకొరియా, ఇరాన్‌, రష్యా, సిరియా ఉన్నాయి. మొత్తం మీద ఈ తీర్మానం ఆమోదం పొందింది.

Also Read: October Weekly Current Affairs (International) Bitbank: Who will become the first Asian American to appear on USA currency?
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 25 Nov 2022 06:01PM

Photo Stories