Russian Oil: అమల్లోకి రష్యా చమురుపై ధరల పరిమితి
Sakshi Education
రష్యా చమురు ధరపై 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్, జీ 7 దేశాలు విధించిన బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితి అమల్లోకి వచ్చింది.
దీంతోపాటు రష్యా నుంచి కొన్ని రకాల చమురు దిగుమతులపై ఆ దేశాలు నిషేధమూ విధించాయి. ఈయూ, జీ7 పరిమితిని రష్యా ఇప్పటికే నిర్ద్వంద్వంగా తిరస్కరించడం తెలిసిందే. పరిమితులు విధించే దేశాలకు చమురు విక్రయాలు పూర్తిగా నిలిపేస్తామని ఇంధన వ్యవహారాలు చూసే రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై వాటి నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. డిసెంబర్ 5వ తేదీ యూఎస్ బెంచ్ మార్క్ చమురు బ్యారెల్‌కు 80.88 డాలర్లు పలికింది.
Russian oil: బ్యారెల్@60 డాలర్లు
Published date : 06 Dec 2022 12:35PM