Russian oil: బ్యారెల్@60 డాలర్లు
రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ధరకు బ్యారెల్‌కు 60 డాలర్ల పరిమితి విధించింది. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఈయూ సభ్య దేశాల మధ్య చివరి నిమిషంలో ఎట్టకేలకు డిసెంబర్ 3వ తేదీ ఇందుకు అంగీకారం కుదిరింది. అమెరికా, జపాన్, కెనడా తదితర జీ 7 దేశాలు కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలిపాయి. ఇది డిసెంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఈయూ, జీ 7 దేశాలకు చమురును బ్యారెల్ 60 డాలర్లు, అంతకంటే తక్కువకు మాత్రమే రష్యా విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ పరిమితిని రష్యా తిరస్కరించింది.
Ukraine war: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ ప్రాణనష్టం
ఈయూ తదితర దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేస్తామని హెచ్చరించింది. ‘‘ఈ ఏడాది నుంచి యూరప్ రష్యా చమురు లేకుండా మనుగడ సాగించాల్సి వస్తుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్, అంతర్జాతీయ సంస్థల్లో రష్యా శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉల్యనోవ్ హెచ్చరించారు. ఈయూ పరిమితితో పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదంటూ నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. ‘‘రష్యా ఇప్పటికే భారత్, చైనా తదితర ఆసియా దేశాలకు అంతకంటే తక్కువకే చమురు విక్రయిస్తోంది. రష్యాను నిజంగా బలహీన పరచాలనుకుంటే బ్యారెల్‌కు 50 డాలర్లు, వీలైతే 40 డాలర్ల పరిమితి విధించాల్సింది’’ అని అభిప్రాయపడుతున్నారు. ఈయూ నిర్ణయం ప్రభావం రానున్న రోజుల్లో యూరప్ దేశాలపై, రష్యాపై, మిగతా ప్రపంచంపై ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది.
☛ చైనా సరిహద్దుల్లో..భారత్, అమెరికా 'యుద్ధ అభ్యాస్'
రూటు మార్చిన రష్యా
రష్యా ప్రపంచంలో రెండో అతి పెద్ద చమురు ఉత్పత్తిదారు. సగటున రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యేదాకా యూరప్ దేశాలే దానికి అతి పెద్ద చమురు మార్కెట్. వాటి కఠిన ఆంక్షల నేపథ్యంలో కథ మారింది. యూరప్ ఎగుమతుల్లో చాలావరకు భారత్, చైనాలకు మళ్లించింది. అయితే కరోనా కల్లోలం నేపథ్యంలో చైనా చమురు దిగుమతులను బాగా తగ్గించుకుంటోంది. ఇదిలాగే కొనసాగితే రష్యా తన చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి రావచ్చు. లభ్యత తగ్గి ధరలకు మళ్లీ రెక్కలు రావచ్చు. చలికాలం కావడంతో చమురు, సహజవాయువు వినియోగం భారీగా పెరిగే ఈయూ దేశాలను ఈ పరిణామం మరింతగా కలవరపెడుతోంది. ‘‘చమురు ధరలు ఏ 120 డాలర్లో ఉంటే 60 డాలర్ల పరిమితి రష్యాకు దెబ్బగా మారేది. కానీ ఇప్పుడున్నది 87 డాలర్లే. రష్యాకు ఉత్పాదక వ్యయం బ్యారెల్‌కు కేవలం 30 డాలర్లే! ’’ అని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
Major Disasters In India : భారతదేశ చరిత్రలో జరిగిన పెను విషాదాలు ఇవే..