Elon Musk: జీ మెయిల్‌కు పోటీగా ఎక్స్ మెయిల్ వచ్చేస్తోంది!!
![Elon Musk Xmail Gmail Alternative Launch Details Kubera Elon Musk discussing XMail](/sites/default/files/images/2024/02/24/elon-musk-xmail-1708769742.jpg)
‘ఎక్స్ మెయిల్’ త్వరలో రాబోతోందని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈమెయిల్ సేవల ముఖచిత్రం మారబోతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు నెటిజన్లు అందరూ వాడే గూగుల్ వారి జీమెయిల్ షట్‌డౌన్ అవుతుందన్న పుకార్ల నడుమ ఎక్స్‌మెయిల్ అరంగేట్రం చేయనుండటం గమనార్హం. జీమెయిల్ 2024 ఆగస్ట్ ఒకటో తేదీన కనుమరుగుకానుందంటూ ‘ఎక్స్’లో ఒక వార్త ప్రత్యక్షమై విస్తృత చర్చకు తెరలేపింది. గూగుల్ పంపిన ఒక ఈమెయిల్‌లో ‘త్వరలో జీమెయిల్ అస్తమించబోతోంది’ అంటూ ఒక సందేశం ఉందని ఆ వార్తలోని సారాంశం. దీనిపై జీమెయిల్ మాతృసంస్థ గూగుల్ స్పందించింది.
this is insane. I hate this company pic.twitter.com/pXBRezPAyX
— Daniel (@growing_daniel) February 22, 2024
‘అవన్నీ శుద్ధ అబద్ధాలు. ఇన్నాళ్లూ బేసిక్ హెచ్‌టీఎంఎల్ వ్యూ ఫార్మాట్‌లో జీమెయిల్ సేవలు అందించాం. ఆ సేవలను ఈ ఏడాది నిలిపివేసి త్వరలోనే ‘స్టాండర్డ్’ వ్యూలో జీమెయిల్ సేవలను అధునాతనంగా అందిస్తాం’ అని గూగుల్ స్పష్టతనిచ్చింది. త్వరలోనే ఎక్స్‌మెయిల్ అందుబాటులోకి వస్తుందని ‘ఎక్స్’ ఇంజనీరింగ్, సెక్యూరిటీ టీమ్ సీనియర్ సభ్యుడు న్యాట్ మెక్‌గ్రేడీ వెల్లడించారు.