Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162 మంది మృతి
Sakshi Education
ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో నవంబర్ 21న (సోమవారం) భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం దాటికి 162 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
భూప్రకంపనల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 నుంచి 5.6 మధ్య నమోదైంది. భూకంపం కారణంగా వేలాది ఇళ్లు నేలకొరిగాయి. భవనాలు కుంగిపోగా, ఓ పాఠశాల ధ్వంసమైంది. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది.
Published date : 22 Nov 2022 11:49AM