DAC: ఆ యుద్ధ విమానాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం... మొత్తం ఎన్నివేల కోట్లంటే..
Sakshi Education
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్‌కు బయలుదేరిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌తో 26 రఫేల్ ఎం రకం యుద్ధవిమానాలు, మూడు స్కార్పీన్ శ్రేణి జలాంతర్గాములను కొనుగోలుకు భారత్ సిద్ధమైంది.
![Rafale-Marine fighter jet](/sites/default/files/images/2023/07/13/ruffale-1689254877.jpg)
ఇందుకు సంబంధించిన రక్షణశాఖ ప్రతిపాదనలకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదం తెలిపింది. దీంతో ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే 22 సింగిల్ సీటర్ రఫేల్ మెరైన్ విమానాలు, నాలుగు రెండు సీట్ల శిక్షణ విమానాలు భారత నౌకాదళానికి అందనున్నాయి. వీటి కొనుగోలుకు సుమారు రూ.90వేల కోట్ల అవుతున్నట్లు అంచనా.
Success Story: ఆ ఘటనతో బ్యాంకు జాబ్ వదిలేశా... మూడేళ్లపాటు వ్యవసాయంలో మెళకువలు నేర్చుకున్నా.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నానిలా
Published date : 13 Jul 2023 06:57PM