G-7 Summit 2022: ముగిసిన జీ - 7 శిఖరాగ్ర సదస్సు
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని జి–7 దేశాధినేతలు ప్రతినబూనారు. రష్యా దాడులు కొనసాగినంత కాలం ఉక్రెయిన్‌కు మద్దతివ్వాలని ఐక్యంగా తీర్మానించారు. జర్మనీలో జరుగుతున్న జి–7 నేతల సదస్సు జూన్ 28తో ముగిసింది. ఈ సందర్భంగా నేతలు తుది ప్రకటన వెలువరించారు.
Also read: Electric Vehicle: ప్రపంచ ఈవీ జాబితాలో భారత్‌కు 11వ ర్యాంక్
‘‘రష్యాపై తక్షణం, అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాలని తీర్మానించాం. పెట్రోల్, గ్యాస్ తదితర శిలాజ ఇంధనాల విక్రయాలతో అందుతున్న నిధులతోనే రష్యా యుద్ధానికి దిగింది. అందుకే, రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఈ శిలాజ ఇంధనాలతోపాటు, వాటి ధరలపై పరిమితులు విధించేందుకు వీలు కలి్పంచే చర్యలపై వచ్చే రానున్న వారాల్లో చర్చించి, కార్యాచరణకు దిగుతాం. రష్యాపై ఆంక్షల కొనసాగింపు విషయంలో కలిసి కట్టుగా సమన్వయంతో ముందుకు సాగేందుకు కట్టుబడి ఉంటాం’అని అందులో పేర్కొన్నారు. రష్యా నుంచి ఇంధన దిగుమతులను కనీస స్థాయికి తేవడం ద్వారా ఇంధన ధరలను అదుపు చేయవచ్చని జి–7 నేతలు భావిస్తున్నారు. ఇంధన సరఫరా నౌకలు, బీమా కంపెనీలు అత్యధికం యూరప్ దేశాలవే కావడం కూడా కలిసివచ్చే అంశమని ఆశిస్తున్నారు. దీంతోపాటు, రష్యా నుంచి బంగారం దిగుమతులను నిషేధించడంతోపాటు, నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ నుంచి గోధుమల రవాణాను రష్యా నిలువరించడంతో ఆహారం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు సాయం చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ అసాధారణ పరిస్థితుల్లో సహజవాయు అన్వేషణకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కూడా తీర్మానించారు.
Also read: IIT Jodhpur: స్వదేశీ పరిజ్ఞానంతో మెటల్ 3డీ ప్రింట
అనంతరం.... మాడ్రిడ్‌లో 28–30 తేదీల్లో జరిగే నాటో సమావేశానికి నేతలు తరలివెళ్లారు.