Holidays to Fall In Love: కాలేజీల్లో ‘లవ్ బ్రేక్’.. లవ్ చేసుకోవడానికి సెలవులు!
కానీ చైనా ప్రభుత్వం తమ దేశంలో యువతీయువకులను ప్రేమించుకోండి అంటూ ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలేందుకు ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ఇస్తోంది. చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆ దేశంలో ఏర్పడిన జనాభా సంక్షోభమే కారణం. చైనాలో జననాలు, వివాహాల శాతాలు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. గడచిన ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనా జనాభా గత ఏడాది తగ్గుముఖం పట్టింది. దీంతో ఆ దేశం దిద్దుబాటు చర్యలకు దిగింది. అక్కడి వివిధ కార్పొరేట్ సంస్థలు సైతం నెల రోజుల పాటు వివాహ సెలవుల్ని మంజూరు చేస్తున్నాయి.
Xi Jinping: చైనా అధ్యక్షుడిగా, సీఎంసీ చైర్మన్‌గా మూడోసారి ఎన్నికైన జిన్‌పింగ్
దశాబ్దాల తరబడి అయితే ఒక్కరు లేదంటే వద్దు అన్న ఆంక్షల చట్రంలో గడిపిన చైనీయులు ఇప్పుడు ప్రేమ, పెళ్లి, పిల్లలు అన్న పదాల పట్ల విముఖంగా ఉన్నారు. అందుకే నేటి తరంలో కాస్తయినా ప్రేమ భావనలు మొలకెత్తడానికి కొన్ని కళాశాలలు ఈ కొత్త ఆలోచన చేశాయి. ఏప్రిల్ అంటే వసంత కాలం. ఈ కాలంలో చెట్లన్నీ విరబూసి వాతావరణం అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. స్ప్రింగ్ సీజన్‌ని ఎంజాయ్ చేయడంతో పాటు లవ్‌లో కూడా పడండి అంటూ ఒక వారం రోజులు సెలవులు ప్రకటించాయి చైనా కాలేజీలు. ‘‘ప్రకృతిని ప్రేమించండి. ప్రేమిస్తే ఎంత కొత్తగా వింతగా ఉంటుందో అనుభూతి చెందండి. లైప్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి’’ అని యువతకి ప్రేమించుకోవడానికి కొన్ని కాలేజీలు హాలీడేస్ ప్రకటించాయి. అలా ప్రేమలో పడ్డ జంటలైనా ఒక్కటై పిల్లల్ని కంటారని ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది.